Annamaya District: స్కూల్.. టీచర్లు.. పిల్లలు.. ఆటలు.. పాటలు.. ఎన్నో సరదా ముచ్చట్లు.. ఎడ్యుకేషనల్ లైఫ్ లో స్కూల్ లో గడిపిన పదేళ్లు ఎప్పటికీ మరిచిపోలేం.. ఓ పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం హోమ్ వర్క్ సరిగ్గా చేయకపోతే టీచర్లు కర్రతో చేతులపై రెండు దెబ్బలు కొట్టేది.. మరుసటి రోజే స్టూడెంట్స్ ఆ దెబ్బలను మరిచిపోయేది.. అదే ఈ రోజుల్లో హోం వర్క్ చేయపోయనా.. బాగా చదవక పోయినా కొట్టే టీచర్ల సంఖ్య చాలా రేర్.. పిల్లలను కొట్టినట్టు ఎక్కడో ఓ చోట వార్తల్లో చూస్తుంటాం.. అయితే ఆ పనిష్ మెంట్ ఏదో రెండు దెబ్బలతో ముగిస్తే పర్లేదు.. పిల్లాడు అని చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొడితేనే సమస్యలను తెచ్చిపెడుతోంది. తాజాగా ఏపీ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి, లక్కీరెడ్డి పల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఫీజు చెల్లించలేదని టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఏకంగా రాయితో స్టూడెంట్ కంటిపై కొట్టి.. కంటి చూపు లేకుండా చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
⦿ ఫీజు చెల్లించలేదని రాయితో కొట్టాడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా రాయచోటి, లక్కీరెడ్డిపల్లి మండలం రిషి వాటీకా గురుకులంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టూడెంట్ (11) రోజు వెళ్లున్నట్టే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాడు. అయితే.. స్టూడెంట్ పేరెంట్స్ గత కొన్ని రోజుల నుంచి ఫీజు చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుడి సైకో అవతారం బయటపడింది. పక్కన ఉన్న రాయి తీసుకుని కంటిపై కొట్టాడు. దీంతో స్టూడెంట్ కంటిచూపు పోయిందని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
⦿ పట్టించుకోని జిల్లా యంత్రాంగం
స్టూడెంట్ పేరెంట్స్ జరిగిన ఘటనపై సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా జిల్లా యంత్రాంగం మొత్తం పాఠశాలకే వత్తాసు పలుకుతూ కేసును నీరు గారుస్తున్నారంటూ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశఆరు. తమ కొడుకు కంటిపై రాయితో కొట్టి కంటిచూపు తీసేశాడని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డను మంచి ప్రయోజకుడుని చేయాలనే ఉద్దేశంతో వెతికి వెతికి ఎంపిక చేసుకున్న పాఠశాలలోనే తమ కొడుకుకి కంటి చూపు కోల్పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు బోరును విలపిస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, విద్యాధికారులను వేడుకుంటున్నారు.
⦿ రాయితో కొట్టడం ఏంటి..? సైకో టీచర్ అంటూ నెటిజన్లు ఫైర్
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. స్కూల్ ఫీజు చెల్లించకపోతే.. అలా రాయి తీసి కంటిపై కొడుతారా..? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు. ‘స్కూల్ ఫీజు చెల్లించకపోతే.. స్టూడెంట్ పేరెంట్స్ ను అడగాలి కానీ.. అలా రాయి తీసుకోని కొట్టడం ఏంట్రా.. సైకో నా వెదవ’ అని ఫైర్ అవుతూ కామెంట్ చేసుకొచ్చాడు. మరి కొంత మంది టీచర్ పై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: Nobel Prize Peace: ట్రంప్‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?