BigTV English

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్ గా మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్లలో మొత్తం బస్సులను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బస్సుల స్థితిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.


ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులను తీసుకురావడం పై ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం, నిర్వహణ ఖర్చులను ఆదా చేయడం, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశాలు. ఈ క్రమంలోనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఏపీఎస్‌ఆర్టీఎస్ 11వేలకు పైగా బస్సులను 2029 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నాలుగేళ్లలో ప్రస్తుతం ఉన్న బస్సులను ఈవీలుగా మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అమరావతి వంటి ప్రధాన నగరాల్లోని ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులను తీసుకురావడం అధికారులు ఫోకస్ పెట్టారు.

ALSO READ: Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు


ఈవీల మార్పు ప్రక్రియకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయడానికి ప్రస్తుత బస్సుల స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంటే ఎంతకాలం బస్సులు సర్వీసులో ఉన్నాయి..? అవ్వి ఎంతకాలం నడుస్తాయి..? అనే వివరాలను అంచనా వేస్తారు. 2029 నాటికి సుమారు 5,731 పాత సిటీ ఆర్డినరీ బస్సులను పక్కన పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను తీసుకురానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇకపై ఆర్టీసీ సముదాయంలోకి కొత్తగా చేర్చే అన్ని బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే తీసుకురావాలని అధికారులు తెలిపారు. కొన్ని పాత డీజిల్ బస్సులను ఈవీలుగా మార్చే అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నిర్వహించడానికి ఛార్జింగ్ మౌలిక వసతులు కల్పించడం ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు.

ALSO READ: CDAC POSTS: సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. తెలంగాణలోనూ భారీగా వెకెన్సీలు, ఈ అర్హత ఉంటే చాలు..!

APSRTC డిపోలు, బస్ టెర్మినల్స్, ప్రధాన బస్ స్టాప్‌లలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘PM e-Bus Sewa’ పథకం కింద కూడా ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాలకు 1,050 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఇవి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్ ద్వారా రానున్నాయి. మొదటి దశలో 750 బస్సులు రానున్నాయి. ఈవీ బస్సుల నిర్వహణకు ప్రత్యేకంగా డ్రైవర్లు, మెకానిక్‌లు, నిర్వహణ సిబ్బందికి నైపుణ్య శిక్షణ అందించాలని కూడా నిర్ణయించారు.ఈ చర్యలన్నీ రాష్ట్రంలో సుస్థిర రవాణా లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ.. డీజిల్ ఖర్చులను తగ్గించడంలో.. కాలుష్య రహిత వాతావరణాన్ని ప్రోత్సహించడంలో ఆర్టీసీకి సహాయపడతాయి.

Related News

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..

Big Stories

×