BigTV English

Moto Edge 50 Pro Price Down: రేటు తగ్గింది పుష్ప.. రూ.7 వేల డిస్కౌంట్.. మోటో కొత్త స్మార్ట్‌ఫోన్!

Moto Edge 50 Pro Price Down: రేటు తగ్గింది పుష్ప.. రూ.7 వేల డిస్కౌంట్.. మోటో కొత్త స్మార్ట్‌ఫోన్!

Moto Edge 50 Pro 5G Price Down: ప్రస్తుతం అంతా స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా ఉంటుంది. కంపెనీలు కూడా సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తూ కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నాయి. అంతే కాకుండా సేల్స్‌ను పెంచుకోవడానికి ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. అయితే మోటరోలా ఇటీవలే Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ కారణంగా కంపెనీ సేల్స్ కూడా భారీగా పెరిగాయి. మొబైల్ ప్రియులు ఎక్కువగా ఈ గ్యాడ్జెట్ కొనుగోలు చేశారు.


మోటరోలా Edge 50 Pro 5G స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoCతో లాంచ్ అయింది. ఈ లైనప్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 ప్రో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ తాజాగా Edge 50 Pro 5G‌పై స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటిచింది. దీంతో ఫోన్‌ను తక్కువ ధరకే లభిస్తుంది. ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: దిమాక్ కరాబ్ డీల్స్.. ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్స్.. కొంటే ఇప్పుడే కొను..!


ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ. 36,999గా ఉంది. దీనిపై రూ.7000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆధారంగా ఫోన్‌ను రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై EMI లావాదేవీలపై కూడా రూ. 2000 తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే బ్యాంక్ ఆఫర్‌ను ద్వారా మీరు మోటరోలా Edge 50 Pro 5Gని రూ.29,999కి బదులుగా రూ.27,999కి కొనుగోలు చేయవచ్చు.

ఇది కాకుండా నెలకు రూ. 5,000 నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు ఈ మోటరోలా ఫోన్‌పై రూ. 28,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఆఫర్లతో 8 GB RAM+ 256 GB ఇంటర్నల్ కలిగిన ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

మోటరోలా Edge 50 Pro 5G స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB RAM+ 256 GB ROM తో వస్తుంది. అంతే కాకుండా ఇతర స్టోరేజ్ వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ముందు భాగంలో ఈ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గేమింగ్, మల్టీమీడియా అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్గెస్ట్ డిస్కౌంట్స్.. ఈ ఐదు ఫోన్లు వదలకండి.. ఇవి పోతే రావ్..!

ఇది 50 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 10 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది మీకు బెటర్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌‌లో 4500 mAh బ్యాటరీ, ఫోన్ Snapdragon 7 Gen 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది బ్లాక్ బ్యూటీ, లక్స్ లావెండర్, మూన్‌లైట్ పెరల్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Tags

Related News

Tesla Pi Phone: టెస్లా ఫోన్ వచ్చేసింది! కార్ల తర్వాత మొబైల్స్‌లో టెస్లా దుమ్మురేపింది

Fake Sora Apps: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Samsung M17 5G: శాంసంగ్ గెలాక్సీ M17 5G లాంచ్.. కేవలం రూ.11999కే అద్భుత ఫీచర్లు

Realme 15T: యూత్‌కి కొత్త క్రేజ్..7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T 5G మొబైల్ లాంచ్

ChatGPT UPI: చాట్‌జిపిటితో యుపిఐ పేమెంట్స్.. ఇక ఏఐ కామర్స్ ప్రారంభం

Redmi 200MP Camera: రూ15000కే 200MP కెమెరా ఫోన్.. రెడ్‌మీ లిమిటెడ్ ఆఫర్!

Big Stories

×