BigTV English

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని.. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల సంస్థల రాకతో.. ఐటీ హబ్‌గా ఏపీ మారబోతోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇక పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల నెలకొల్పేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కార్ పెట్టుబడులు తెస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.


దీంతో పాటు రైతులకు మేలు చేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. టూరిజం ఒక గేమ్ ఛేంజర్ లాంటి పాలసీ అని మంత్రి పార్థసారధి అన్నారు. రాష్ట్రంలో పర్యాటకానికి అన్ని అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దాదాపు 70 వేల ఉద్యోగాలు పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద పెట్టుబడికి కేబినేట్ ఆమోదం తెలిపిన తర్వాత.. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు.. మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు


అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినేట్ ఆమోదం తెలిపింది. విజయనగరం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జూమర్ ప్రాజెక్టు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

Related News

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..

Big Stories

×