BigTV English

Pendem Dorababu Resigns to YCP: జగన్‌కు దొరబాబు దెబ్బ.. పవన్‌తో టచ్‌లో ఉంటే చెప్తా..

Pendem Dorababu Resigns to YCP: జగన్‌కు దొరబాబు దెబ్బ.. పవన్‌తో టచ్‌లో ఉంటే చెప్తా..

మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తెగ చెలరేగిపోయింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుని, పిఠాపురంలో జనసనాని పవన్‌కళ్యాణ్‌ని ఓడించబోతున్నామని తెగ హడావుడి చేసింది. అసలు పవన్‌కళ్యాణ్‌ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని సవాళ్లు చేశారు ఆ పార్టీ నేతలు అందులో భాగంగా పిఠాపురంలో నిర్ణయాత్మకంగా ఉన్న కాపు నియోజకవర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి ముద్రగడ వంటి నేతల్ని ప్రచారంలో దింపి నానా పాట్లు పడ్డారు.

సీన్ కట్ చేస్తే పిఠాపురంలో సంచలన విజయం సాధించిన పవన్‌కళ్యాణ్ వైసీపీకి తన స్టామినా ఏంటో చూపించారు. ఏకంగా 70 వేలకుపైగా మెజారిటీతో వంగా గీతపై గెలుపొంది పిఠాపరంలో జనసేన జెండా ఎగరేశారు. అదలాఉంటే పోలింగ్ నాటికే పిఠాపురంలో వైసీపీ పరాజయం కన్‌ఫర్మ్ అయినట్లు కనిపించింది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును పక్కనపెట్టిన జగన్ .. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీకి పెట్టారు. పిఠాపురంలో దొరబాబు రాజకీయప్రస్థానం ఘనంగానే సాగింది. 2004లో మొదటి సారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన  2014లో టీడీపీ అభ్యర్ధి వర్మ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.


దొరబాబు మొన్నటి ఎలక్షన్స్ లో  తనకు టికెట్ రాకపోవడంతో.. అప్పటి నుంచే వైసీసీతో గ్యాప్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. అప్పట్లోనే ఆయన జనసేన వైపు చూసారన్న టాక్ నడిచింది. అయితే వైసిపి పెద్దలు పిలిచి జిల్లా వైసీపీ అధ్యక్షుడు పదవి లేక సముచిత స్థానం ఇస్తామని వంగా గీతకు సపోర్ట్ చేయాలని బుజ్జగించారు.

Also Read: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. ఇకనుంచి ఫటాఫట్ పరిష్కారం కానున్న సమస్యలు

అయితే ఎన్నికల సమయంలో పిఠాపురంలో పెత్తనమంతా ద్వారంపూడి, ముద్రగడలదే నడిచింది. దాంతో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని.. కనీస కార్యకర్తగా కూడా చూడలేదని దొరబాబు అసంతృప్తితో కనిపించారు. తనను కాదని కాకినాడ్ ఎంపీగా ఉన్న వంగా గీతకు అవకాశం ఇవ్వడం  దానికి తోడు, వంగా గీత పార్టీ కార్యాలయాన్ని తన ఇంటి సమీపంలో ఏర్పాటుచేయడం దొరబాబులో అసంతృప్తిని మరింత రగిల్చిందంటారు. మొత్తానికి తన నిర్ణయం ఏంటో ప్రకటించిన దొరబాబు ఫ్యూచర్ ప్లాన్ కూడా ప్రకటించేశారు. ఆ అసంతృప్తి ఇప్పుడు బయటపడింది. వైసీపీకి పెండెం దొరబాబు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు ఆయన.

పిఠాపురంలో పవన్‌ని ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డింది. అలాందిప్పుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్వయంగా పవన్‌కి జై కొడుతూ జనసేనాని వెంటే తన పయనం అంటున్నారు. అది నిజంగా జగన్‌కి పుండు మీద కారం చల్లే నిర్ణయమే అంటున్నారు. మొత్తానికి వైసీపీ మాజీలంతా ఆ పార్టీకి దూరమయ్యే పరస్థితి కనిపిస్తోందిప్పుడు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×