BigTV English

Sunita Williams: 2025 ఫిబ్రవరిలోనే భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎందుకో తెలుసా ?

Sunita Williams: 2025 ఫిబ్రవరిలోనే భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎందుకో తెలుసా ?

Sunita Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ లివ్మోర్ స్పేస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సాంకేతిక లోపం కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుని పోయారు. ఈ ఇద్దరు వ్యోమగాములు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ ప్రకటన విడుదల చేసింది.


బోయింగ్ స్టార్ లైనర్‌లో వెళ్లిన ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చేందుకు పరిశీలిస్తున్నామని నాసా తెలిపింది. సునీతా విలియమ్స్, విల్మోర్‌ను స్టార్ లైనర్ జూన్ 5 వ తేదీన ఇంటర్ నేషనల్ ఐఎస్ఎస్‌కు తీసుకు వెళ్లింది. వీరు ఎనిమిది రోజుల మిషన్‌ను పూర్తి చేసుకుని మళ్లీ భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. కానీ..హీలియం లీక్‌తో పాట్ మరి కొన్ని కారణాల వల్ల వ్యోమగాములు భూమికి తిరిగి రావడం లేదు.

బోయింగ్ సంస్థకు ఇదే తొలి మిషన్. సునీత సునీతా విలియమ్స్ విల్మోర్ రెండు నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరూ 2025 ఫిబ్రవరిలో మాత్రమే భూమిపైకి తిరిగి వచ్చే అవకాశముందని నాసా వెల్లడించింది. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ మాట్లాడుతూ వారిని తిరిగి రావడం తమకు మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఎలాన్ మస్క్ కంపెనీతో నాసా పనిచేస్తుందని వెల్లడించారు. వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని అన్నారు.


Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్, వేటాడి ఊచకోత

స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ సహాయంతో తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. స్పెస్ మిషన్‌లో ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ పంపేందుకు అవకాశం ఉంది. ఈ ప్రయోగం సెప్టెంబర్‌లో ఉండవచ్చు. దీనితోనే సునీతా విలియమ్స్ భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తోంది. స్టార్ లైన్ లోనే తీసుకు రావాలా లేకపోతే క్రూ డ్రాగన్ ఉపయోగించాలా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×