E-Paper
Advertisement

కూటమికి ప్రభుత్వానికి ఊహించని షాక్.. రాజానగరంలో వైసీపీ ఘనవిజయం!

కూటమికి ప్రభుత్వానికి ఊహించని షాక్.. రాజానగరంలో వైసీపీ ఘనవిజయం!
Advertisement

Rajanagaram Politics: ఏపీలోని రాజానగరం నియోజకవర్గంలో నేడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీలకు దీటైన పోటీ ఇచ్చింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 స్థానాలు ఉండగా, వాటిలో దాదాపుగా 30 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. అధికార కూటమి పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయంగా ఇప్పుడు సంచలనంగా మారింది.

12 స్థానాల్లో విజయ..

అయితే సీతానగరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలతో పాటు 12 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ పార్టీ గెలిచింది. దీంతో ముఖ్యంగా జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు 2,007 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం సంచలనంగా మారింది. దీంతో పాటుగా కోరుకొండ మండలంలో మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ 12 స్థానాల్లో విజయడంకా మోగించింది. ఎంపీపీ స్థానాన్ని సైతం తన ఖాతాలో వేసుకుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో పోటీపడి సగానికి పైగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

రాజా నాయకత్వంలో సమష్టి కృషి..

Advertisement

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ గెలుచుకున్న ఏకైక జడ్పీటీసీ స్థానం రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం కావడం ఇప్పుడు అతి పెద్ద హట్ టాపిక్.. దీంతోపాటు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు విజయం సాధించడం ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నాయకత్వంలో పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయడంతోనే ఈ ఫలితాల్లో ప్రతిబింబించిందని అటు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కూటమి పార్టీలకు పోటీనిస్తూ 30 స్థానాలను సాధించడం స్థానిక రాజకీయాల్లో ఇప్పడు తీవ్ర చర్చకు తెరలేపింది.

Also Read: కూటమి ఆధిపత్యానికి జక్కంపూడి రాజా చెక్.. మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌తో తిరగబడ్డ ఫలితాలు!

Tags

Related News

కూటమి ఆధిపత్యానికి జక్కంపూడి రాజా చెక్.. మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌తో తిరగబడ్డ ఫలితాలు!

బలిజిపేట జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ నేతలు భారీగా ధర్నా!

అవకాశం ఉంటే రే*ప్ కేసు కూడా పెట్టేవారేమో! నల్లపాడు పోలీసులపై అంబటి షాకింగ్ కామెంట్స్

కౌంటింగ్‌కు ముందు రోజే మరణం.. వైసిపిపై 352 ఓట్లతో జనసేన MPTCగా ఘన విజయం!

ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై ఉద్రిక్తత.. మాజీ మంత్రి రోజా ధర్నా..!

బాలకృష్ణ పీఏ ఎంట్రీతో రాజుకున్న వివాదం.. హిందూపురం కౌంటింగ్ సెంటర్ వద్ద రచ్చ రచ్చ!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి హవా.. పులివెందులలో టీడీపీ విక్టరీ.. ఇంకా ఎక్కడెక్కడ గెలిచారంటే?

Big Stories

Advertisement
×