AP Election Results: ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కనిపిస్తోంది. మున్సిపాలిటీలు, మున్సిపాల్ కార్పొరేషన్స్ తరహాలోనే పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. వార్త రాసే సమయానికి మెుత్తం 84 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మరో 121 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు వైసీపీ తరపున జడ్పీటీసీల్లో ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించగా.. 9 మంది ఆధిక్యంలో ఉన్నారు. అటు ఎంపీటీసీకి సంబంధించి 2,113 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. వైసీపీ తరపున 121 మంది గెలుపొందారు. ఇతరులు 40 గెలుచుకున్నారు.
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించారు. 1463 ఓట్ల మెజార్టీతో గెలుపును సొంతం చేసుకున్నారు. అటు మైదుకూరు జడ్పీటీసీ సైతం తెదేపా వశమైంది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నేత కృష్ణ కిషోర్ ఘన విజయం సాధించారు. మరోవైపు అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల్లోనూ కూటమి ఆధిపత్యం చెలాయిస్తోంది. మన్యం జిల్లా సాలూరు మండలం సారిక ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గనుతూరు భాస్కర్ విజయం సాధించారు. తెనాలి మండలం హాఫ్ పేట ఎంపీటీసీ స్థానం కూడా టీడీపీకే దక్కింది. కడప జిల్లా సుద్దపల్లె ఎంపీటీసీ టీడీపీ ఖాతాలో చేరింది.
Also Read: అమెరికా బంపరాఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెప్తే రూ.165 కోట్లు.. గిఫ్ట్‌గా యూఏస్ పౌరసత్వం!
అటు కోవూరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తికాగా.. దాదాపు అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకే అత్యధిక ఓట్లు వచ్చినట్లు సమాచారం. మరోవైపు గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానంలో మిక్కిలి శ్రావణిలో 74 ఓట్లతో తేడాతో గెలుపొందారు. అటు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం పోస్టల్ బ్యాలెట్ లో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే చెల్లనివే ఎక్కువ ఉండటం షాక్ కు గురిచేసింది. మెుత్తం 201 ఓట్లు బ్యాలెట్ ఉండగా అందులో 85 చెల్లనివిగా అధికారులు పక్కన పెట్టారు. వైకాపాకు 54, టీడీపీకి 50, స్వతంత్ర అభ్యర్థికి 11 ఓట్లు పడటం గమనార్హం.
Also Read: తొలిసారి డేటింగ్‌కు వెళుతున్నారా? అమ్మాయిలు గమనించే విషయాలు ఇవే