E-Paper
Advertisement

JanaSena: జనసేనలో రాయపాటి రచ్చ.. చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్..

JanaSena: జనసేనలో రాయపాటి రచ్చ.. చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్..
Advertisement
Janasena party latest news

Janasena party latest news today(Andhra news updates): జనసేనలో ప్రజారాజ్యం రచ్చ ముదురుతోంది. గతంలో జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో అరుణపై మెగాఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలేంటంటూ మండిపడుతున్నారు. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్‌ చేయాలంటున్నారు.

అసలు రాయపాటి అరుణ ఏం అన్నారు? మెగా ఫ్యాన్స్‌ ఎందుకు ఇంతగా మండిపడుతున్నారు? అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో ఓ టీవీ చానల్ డిబేట్‌లో చిరంజీవిపై కామెంట్స్‌ చేశారు అరుణ. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఫెయిల్యూర్ పాత్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఆయనదేముంది వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారంటూ మెగాస్టార్‌ పై రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

మరోవైపు తనపై విమర్శళు రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు రాయపాటి అరుణ. అధికార వైసీపీ నేతలు కూడా ఇంతలా బాధపెట్టలేదని..కానీ చిరంజీవి ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయంలో రాయపాటి అరుణకు మద్దతుగా నిలిచారు నాగబాబు. ఆమె ఏదో ఫ్లోలో మాట్లాడిన ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసే అరుణను అభిమానులు తప్పుడుగా అర్థం చేసుకోవద్దని సూచించారు.

తాజా వివాదంపై రాయపాటి అరుణ ట్వీట్ చేశారు. జనసేన కార్యకర్తలు ఈ ఇష్యూపై స్పందించ వద్దని కోరారు. పూర్తిగా వీడియో చూసిన వాళ్లెవరూ తనను తిట్టరని పేర్కొన్నారు. కావాలని ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి జనసేనకు నష్టం చేయాలనేది వైసీపీ ప్లాన్ అని రాయపాటి అరుణ ట్వీట్ చేశారు. పిల్ల బిజ్జల ఏవో పిల్ల ఎడిట్‌లు చేసి చిరంజీవి ఫ్యాన్స్‌ను తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×