జగన్ బంగారుపాళ్యం పర్యటన సూపర్ సక్సెస్ అంటూ వైసీపీ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్టింగ్ తో ఆ పార్టీ తన పరువు తానే తీసుకున్నట్లయింది. వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు రైతుల్ని పరామర్శించడానిక వెళ్తే ఆ యాత్రని సక్సెస్ అనగలమా..? పోనీ ఆ రైతులకు సమస్య ఉంటే, ఆ నాయకుడి పర్యటన వల్ల సమస్య పరిష్కారం అయితే అది సక్సెస్ అయినట్టు చెప్పుకోవాలి. జనాలు వచ్చారు, జగనన్నను చుట్టుముట్టారు, జేజేలు కొట్టారు.. అందుకే టూర్ సక్సెస్ అయింది అని వైసీపీ వేసిన ట్వీట్.. ఆ పార్టీ ఏం కోరుకుంటుందో చెప్పకనే చెబుతోంది. జగన్ కూడా ఇదే కోరుకున్నారా? లేక జగన్ పరువుని కూడా సోషల్ మీడియా వింగ్ ఇలా తీసిపారేసిందా?
జగనన్న బంగారుపాళ్యం పర్యటన సూపర్ సక్సెస్
మామిడి రైతులకి మద్దతు వెళ్లిన జగనన్న కోసం.. కదిలొచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యకర్తలు, ప్రజలు
అడుగడుగునా జన నీరాజనం.. అందరికీ అభివాదం చేస్తూ కదిలిన జననేత#YSJaganInChittoor#YSRCPForFarmers#CBNFailedCM#SadistChandraBabu pic.twitter.com/Xbod38i0Nc
— YSR Congress Party (@YSRCParty) July 10, 2025
రైతులకు ఎంత సమయం కేటాయించారు..?
రైతుల్ని కలిసేందుకు, వారి కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు బంగారుపాళ్యం వెళ్లాలనుకున్నారు జగన్. కానీ నిజంగా జగన్ రైతుల్ని కలసి ఎంత సమయం కేటాయించారు. ఎంతమందితో మాట్లాడారు. ఎంతమందికి భరోసా ఇచ్చారు. పోనీ ఆ పర్యటన వల్ల ఒరిగిందేంటి..? ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశారా..? ఆసూచనల వల్ల కొత్త నిర్ణయాలు అమలులోకి వచ్చి రైతులకు మేలు జరిగిందా..? ఇదంతా జరిగితే నిజంగానే ఆ పర్యటన సూపర్ సక్సెస్ అయినట్టు. కానీ జగన్ మాత్రం జనం వచ్చారని చంకలు గుద్దుకుంటూ కారులోనుంచి బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారని టీడీపీ విమర్శిస్తోంది. ఇలాంటి పర్యటన ఎక్కడా చూడలేదని, కేవలం జన సమీకరణ కోసమే జగన్ పర్యటనను వాడుకున్నారని అంటున్నారు.
అన్ని పర్యటనలు ఇంతేనా..?
ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ చేపట్టిన పర్యటనలన్నీ ఇలానే ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. బాధితుల్ని పరామర్శించేందుకంటూ పర్యటన మొదలు పెట్టే జగన్, ఆ తర్వాత స్థానిక నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేయడానికి, రోడ్ షో ద్వారా జనంలోకి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అసలు బాధితులకు కేటాయించే సమయం తక్కువ, కొసరు రోడ్ షో లకు పట్టే సమయం ఎక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈలోగా జనం ఆయన కోసం పరుగులు తీస్తున్నట్టు, రోడ్డు మార్గంలో అనుంతి లేకపోతే పొలం గట్ల వెంబటి బైక్ లలో వస్తున్నట్టు, పోలీసుల కళ్లుగప్పి జగన్ వద్దకు చేరుకున్నట్టు ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారని అంటున్నారు. వాస్తవానికి జగన్ ఇటీవల చేపట్టిన పర్యటనలన్నిట్లో ఇవే కామన్ గా కనపడుతున్నాయి. జగన్ ని కలిసేందుకు వచ్చిన జనం, వారి నినాదాలు, జగన్ చేసే అభివాదాలు ఇవే కనపడుతున్నాయి కానీ, అసలు రైతులతో జగన్ ఏం మాట్లాడారు, వారు జగన్ కి ఏం చెప్పారు అనేది వారి సొంత మీడియా కూడా హైలైట్ చేయలేకపోతోంది. ఎందుకంటే అక్కడ రైతులతో జగన్ అతి తక్కువ సమయం మాత్రమే గడిపారు. మిగతా సమయం అంతా రోడ్ షో లకే సరిపోయింది. ఇలాంటి టైమ్ లో జగన్ టూర్ సక్సెస్ అంటూ ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హడావిడి చేయడం నిజంగానే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు నెటిజన్లు.
ఇక జగన్ ట్వీట్ దీనికి కొసమెరుపు కావడం విశేషం. వైసీపీ సొంత పేపర్ లో వచ్చిన అంశాలన్నిటినీ జగన్ ఈరోజు తన ట్వీట్ లో తెలియజేశారని తెలుస్తోంది. ప్రభుత్వానికి ఆయన ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. వైసీపీ హయాంలో రైతులకు మేలు జరిగిందని, కూటమి వచ్చాక అన్యాయం చేస్తున్నారని ట్విట్టర్లో మండిపడ్డారు జగన్.
1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025