Film industry : ఫిలిం ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఏలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ కన్నుమూశారు. శ్రీకాకుళం నుండి నెల్లూరుకి తన డాన్స్ టీం తో కలిసి టాటా మ్యాజిక్ లో బయలుదేరారు. అందులో మొత్తం 11 మంది కలిసి వెళ్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని కృష్ణపల్లి నేషనల్ హైవే ఫ్లై ఓవర్ పై టాటా మ్యాజిక్ వెళ్తూ ఉండగా.. లారీ డ్రైవర్ ముందు నుండి వస్తున్న కంటైనర్ ను గమనించలేదు. దాంతో వేగంగా వచ్చిన కంటైనర్ టాటా మ్యాజిక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డాన్స్ మాస్టర్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా బృందానికి స్వల్ప గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన డాన్స్ ప్రోగ్రాంకి వీరంతా వెళ్తున్నారట. ఎదురుగా ఉన్న లారీ కంటైనర్ ను మరొక లారీని ఢీ కొట్టడంతో అది వెనక్కి వచ్చింది. ఆ కంటైనర్ వేగంగా వెనక్కి రావడం గమనించని టాటా మ్యాజిక్ డ్రైవర్ అప్రమత్తం కాలేకపోయారు.. అది వేగంగా వచ్చి టాటా మ్యాజిక్ ను ఢీ కొట్టింది. ఇక ప్రమాదం రెప్పపాటులో జరగడంతో డ్రైవర్ ఆ ప్రమాదాన్ని గ్రహించలేకపోయారు.. దీంతో టాటా మ్యాజిక్ మొదటి భాగం మొత్తం తుక్కు తుక్కు అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:SSMB 29 Update : ఫ్రాంఛైజీగా జక్కన్న మూవీ… ఎన్ని వందల కోట్లు పెడుతున్నారో తెలుసా ?