OYO Offers: ప్రయాణం అంటే అందరికీ ఎంతో ఇష్టం. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్త అనుభవాలు ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మన ప్రయాణంలో ముఖ్యమైన సమస్య ఏంటంటే, సరైన హోటల్ దొరకడమే. ఎక్కడ ఆగితే సౌకర్యం ఉంటుందో, బడ్జెట్ లోపల దొరకుతుందో అనే ఆలోచన అందరిలోనూ ఉంటుంది. చాలా సార్లు హోటల్ బుకింగ్ కోసం ఎన్నో వెబ్‌సైట్లలో వెతకాల్సి వస్తుంది. ఇలాంటి టెన్షన్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేసింది ఓయో.
తక్కువ ధర- సౌకర్యంగా
ఓయో అనగానే గుర్తుకొచ్చేది ఏమిటంటే, తక్కువ ధరల్లో, బడ్జెట్ ఫ్రెండ్లీగా, మన అవసరాలకు తగ్గట్లుగా మంచి సౌకర్యాలతో హోటల్ బుకింగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓయో ఇప్పుడు ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. మీ సమీపంలో ఉన్న హోటల్స్ పై 75% వరకు భారీ తగ్గింపు ఇస్తోంది. అంటే సాధారణంగా మీరు వెయ్యి రూపాయలు ఖర్చు చేసే చోట, ఇప్పుడు కేవలం 250 రూపాయలకే ఉండొచ్చు. ఇది వినడానికే కాకుండా వాడుకోవడానికి కూడా చాలా బాగుంది కదా!
అవసరానికి తగ్గట్లుగా ఆప్షన్లు
జంటల కోసం ప్రత్యేక ఆఫర్లు, ఫ్యామిలీ ట్రిప్స్‌కి ప్రత్యేక ప్యాకేజీలు, బిజినెస్ ట్రిప్స్‌కి సరైన సౌకర్యాలు ఇలా ప్రతి ఒక్కరికీ అవసరానికి తగ్గట్లుగా ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ ఓపెన్ చేస్తే, హోటల్ లొకేషన్, ధర, సౌకర్యాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.
Also Read: JioMart Offers: జియోమార్ట్ కొత్త ఆఫర్.. మొదటి ఆర్డర్‌పై అదిరిపోయే తగ్గింపు
ఓయో ద్వారా సులభంగా బుకింగ్
అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే, మనం ఎక్కడ ఉన్నామో దాని ఆధారంగా, సమీపంలోని హోటల్స్‌ను చూపిస్తుంది. ఉదాహరణకి, మీరు హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి లేదా ఏ చిన్న పట్టణానికైనా వెళ్ళినా, అక్కడ సమీపంలో ఉన్న బడ్జెట్ హోటల్ ఓయో ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
శుభ్రత, భద్రత ఉంటుందా?
ఒక హోటల్ బుక్ చేయాలంటే మిగతా విషయాలు కూడా మనకు ముఖ్యం కదా. గదులు శుభ్రంగా ఉన్నాయా? భద్రత ఉందా? సౌకర్యాలు సరిపోతాయా? అనే ప్రశ్నలు వస్తాయి. వీటన్నింటికీ సమాధానం ఒకటే ఓయో. ఎందుకంటే వీరి దగ్గర కస్టమర్ల రివ్యూలు, రేటింగ్స్ కూడా కనిపిస్తాయి. మీరు చూసి, సరైన హోటల్ ఎంచుకోవచ్చు. మరొక విషయమేమిటంటే జంటలకు ప్రత్యేకంగా ప్రైవసీ కలిగిన గదులు, సేఫ్టీ, పూర్తి గోప్యత కూడా అందిస్తారు. అందుకే చాలామంది యువత, నూతన జంటలు ఓయోని ఎక్కువగా ఎంచుకుంటారు.
బుకింగ్ కెన్సిల్ చేస్తే డబ్బులు వస్తాయా?
బుకింగ్ కెన్సిల్ చేయాల్సి వస్తే, లేదా చివరి నిమిషంలో మార్పులు చేసుకోవాల్సి వచ్చినా, ఓయోలో ఆప్షన్స్ కూడా ఉంటుంది. కాబట్టి డబ్బులు వృథా అవుతాయనే భయం కూడా ఉండదు. క్యాన్సిల్ చేసిన వెంటనే మీరు పెట్టిన మొత్తం డబ్బులు మీ అకౌంట్‌కి చేరుతుంది. దీంతో డబ్బులు పోతాయనే భయపడాల్సిన పనిలేదు.
వారి కోసం 75% డిస్కౌంట్!
ఇక కొత్త యూజర్ల కోసం ప్రత్యేకంగా ఈ 75% డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే మీరు ఇప్పటివరకూ ఓయో వాడలేదంటే, ఇదే సరైన సమయం. యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, మొదటి బుకింగ్ చేస్తేనే మీరు ఈ భారీ ఆఫర్ పొందవచ్చు. మీ మొబైల్‌లో ఓయో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి, అప్పుడు మీ ప్రయాణం నిజంగానే మరపురాని అనుభవంగా మారుతుంది.