Morocco News: మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే, ఆమె భర్త అబ్దెల్ ఖాదర్ ఆర్బీ 2021లో చరిత్ర సృష్టించారు. హలీమా ఒకేసారి తొమ్మిది పిల్లలను కనడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించారు. ఈ అద్భుతమైన ఘనతను సాధించిన మొదటి మహిళగా హలీమా సిస్సే నిలిచింది. అయితే గతంలో ఒకేసారి తొమ్మిది శిశువులు జన్మించారు. కానీ కొంతమంది పుట్టగానే మృతిచెందారు. ఈ అసాధారణ సంఘటన 2021 మే 4న మొరాకోలోని కాసాబ్లాంకాలోని ఐన్ బోర్జా క్లినిక్‌లో జరిగింది. హలీమా అప్పటికే 25 ఏళ్ల విద్యార్థిని, మొదట ఆమె గర్భంలో ఏడు మంది శిశువులు ఉన్నట్టు వైద్యులు భావించారు. అయితే, మాలి ప్రభుత్వం ఆమెను మొరాకోలోని ప్రత్యేక క్లినిక్‌కు తరలించిన తర్వాత, స్కానింగ్‌లో మరో ఇద్దరు శిశువులు గర్భంలో ఉన్నట్టు గుర్తించారు.
ఈ తొమ్మిది శిశువుల్లో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. ఐదుగురు బాలికలు (అడామా, ఒమౌ, హవా, కడిడియా, ఫాటౌమా), నలుగురు బాలురు (మహమ్మద్ VI, ఒమర్, ఎల్హాద్జీ, బహ్) 30 వారాల వద్ద అకాలంగా సిజేరియన్ ద్వారా జన్మించారు. పుట్టినప్పటి నుంచి వారి బరువు 0.5 నుండి 1 కేజీల మధ్య ఉంది. మొత్తం 32 మంది వైద్య సిబ్బంది ఈ డెలివరీని విజయవంతంగా నిర్వహించారు. శిశువులు ఆరోగ్య సంరక్షణ కోసం ఇంక్యుబేటర్‌లలో చాలా నెలలు ఉంచారు. హలీమాకు కూడా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. హలీమా ఈ 9 మంది శిశువులను కనడం ద్వారా గిన్నిస్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నారు. గతంలో నాద్యా సులేమాన్ ఎనిమిది మంది శిశువుల రికార్డ్‌ను హలీమా సిస్సే, అబ్దెల్ ఖాదర్ అర్బీ బద్దలు కొట్టారు.
2025 మే 4న ఈ తొమ్మిది మంది పిల్లలు నాలుగో పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. హలీమా సిస్సే, అబ్దెల్ ఖాదర్ సోషల్ మీడియాలో తమ పిల్లల చిత్రాలను షేర్ చేశారు. ఇందులో గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ‘ఈ మధురమైన క్షణాలను మరవలేవు.. అద్భుతమైన శక్తి.. అపారమైన ప్రేమ’ అని వారు రాసుకొచ్చారు. తొమ్మిది మంది పిల్లలు ఇప్పుడు యాక్టివ్ గా తిరగడం.. హావా భావాలను వ్యక్తపరచడం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. ఈ శిశువుల్లో అడామా ఇంట్రెస్టింగ్ గల, ఒమర్ సైలెంట్ వ్యక్తిత్వం, మహమ్మద్ హావ భావాలను వ్యక్తపరచడంలో ప్రసిద్ధుడు. కడిడియా స్నేహశీలియైన పిల్లాడు. వీరందరికీ ఆరేళ్ల సౌదా అనే సిస్టర్ కూడా ఉంది.
మొరాకోలో 19 నెలలు గడిపిన తర్వాత, ఈ కుటుంబం మాలికి తిరిగి వచ్చింది. వారి నాల్గవ పుట్టినరోజు సందర్భంగా, హలీమా ‘దేవుని కృపతో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. వారు గత సంవత్సరం కంటే చాలా పెరిగారు అని చెప్పారు. ఈ కుటుంబం మాలి ప్రభుత్వం, వైద్య సిబ్బంది, సమాజం నుండి అందిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.
ALSO READ: Airport Jobs: బంపర్ ఆఫర్ భయ్యా.. పదితో 1446 ఉద్యోగాలు, ఒక్కసారి అప్లై చేసి చూడండి..
ALSO READ: PM Vidyalaxmi: స్టూడెంట్స్‌కు సూపర్ న్యూస్.. సింపుల్‌గా రూ.7,50,000 లోన్ పొందండిలా?