Kishkindhapuri Trailer: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కిష్కింధపురి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్లో హార్రర్ ఎలిమెంట్స్, బీజీఎం, విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సాహు గారపాటి నిర్మాణంలో మిస్టరీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈనెల 12వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో అనుపమ దెయ్యం గెటప్ లో కనిపించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకునే ఈ చిన్నది మరి ఏ మేరకు థియేటర్లలో మెప్పిస్తుందో చూడాలి.
కిష్కింధపురి ట్రైలర్ ఎలా ఉందంటే?
కిష్కింధపురి ట్రైలర్ మొదలవ్వగానే.. ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ వెయ్యేళ్ళు వెలగాలని తూర్పు తిరిగి ప్రయాణం మొదలపెట్టు అనే డైలాగుతో దట్టమైన అడవులను, ఊరి జాతరను చూపిస్తూ ట్రైలర్లో అంచనాలు పెంచేసారు. ప్రేతాత్మ దాని పరిచయం.. దెయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్లందర్నీ ఒక దెయ్యాల కొంపకు తీసుకెళ్లి.. దాని వెనుక ఉన్న దెయ్యాల స్టోరీని చెప్పి ఆ ప్యాలెస్ కి వారిని పిలుస్తారు. ఇదే కాన్సెప్ట్ తో.. వచ్చిన ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే రాజు గారి గది సినిమా గుర్తొస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
క్యూరియాసిటీ పెంచుతున్న సీన్స్..
కిష్కింధపురి గెస్ట్ హౌస్ అనే దెయ్యాల కొంపలోకి షో పేరిట ఆహ్వానించి.. ఆ తర్వాత ఏం చేయబోతున్నారు అనే కాన్సెప్ట్ తో మూవీ రూపొందించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు శ్రీకాంత్ అయ్యంగర్ , హైపర్ ఆది ఇలా వీరంతా ఆ కిష్కిందపురి గెస్ట్ హౌస్ లో షో కోసం వచ్చినవారు అక్కడ ఏం చేయబోతున్నారు? వీరికి దెయ్యాలు నిజంగానే ఎదురయ్యాయా ? ఆ తర్వాత అనుపమ దెయ్యంగా ఎలా మారింది? ఏం చేసింది? ఇలా పలు విషయాలపై క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఆకట్టుకుంటున్న డైలాగ్స్..
ఆ కిష్కింధపురి గెస్ట్ హౌస్ లోకి అడుగుపెట్టగానే.. “సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదాలు” అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత దయ్యాలు చేసే విధ్వంసం అక్కడ చూపించారు. భయంకరమైన దృశ్యాలు అంతకు మించిన శబ్దాలు ఆ హౌస్ లో ఉన్న వారికి చెమటలు పట్టిస్తాయి. “బ్రతుకు మీద తీపి ఉన్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు” అంటూ సాగే డైలాగ్స్ కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ALSO READ:Film industry: డాన్స్ మాస్టర్ కి ఆక్సిడెంట్.. అక్కడిక్కడే మృతి!