BigTV English

Emraan Hashmi: ఓమీ.. టాలీవుడ్ లో బాగా వినిపించే పేరు అవుతుంది

Emraan Hashmi: ఓమీ.. టాలీవుడ్ లో బాగా వినిపించే పేరు అవుతుంది
Advertisement

Emraan Hashmi: ఒకప్పుడు విలన్స్ అంటే.. ముఖంపై పెద్దగాటు.. భారీ పర్సనాలిటీ.. పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చే విధంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు సినిమాలో హీరో ఎవరో.. విలన్ ఎవరో తెలుసుకోవడమే కష్టంగా మారింది. అంతేనా కొన్ని సినిమాల్లో అయితే హీరోనే డామినేట్ చేసే విలన్స్ ఉన్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న కూలీ సినిమాలో రజినీకాంత్ ను నాగార్జున డామినేట్ చేశాడు. పాత్ర పరంగా పక్కన పెడితే.. లుక్స్ పరంగా నాగ్ వచ్చిన ప్రతిసారి అందరి దృష్టి అతనిపైనే ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత స్టైలిష్ గా నాగ్ చూపించాడు లోకేష్.


సాధారణంగా ఏ సినిమాలో అయినా విలన్ ను ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తే హీరోకి అంత ఎలివేషన్స్ ఉంటాయి. అదే సక్సెస్ మంత్రం. అది తెలుసుకున్న డైరెక్టర్ ఎవరన్నా సరే.. హీరో కన్నా ఎక్కువ విలన్ మీదనే ఫోకస్ చేస్తాడు. హీరో- విలన్ ఎదురెదురుగా నిలబడితే పోటాపోటీగా ఎవరిని చూడాలా అని ప్రేక్షకుడు కన్ఫ్యూజన్ లో ఉండాలి. అప్పుడే  సినిమాపై హైప్ క్రియేట్  అవుతుంది. ఈ విషయంలో కుర్ర డైరెక్టర్ సుజీత్ మొదట్లోనే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం OG. ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. నిన్న పవన్ పుట్టినరోజున OG నుంచి ఇమ్రాన్ క్యారెక్టర్ ఓమీని పరిచయం చేశారు. అదేంటి పవన్ బర్త్ డే  స్పెషల్ అని చెప్పి ఓమీని పరిచయం చేశారు అని అభిమానులు నిరుత్సాహపడినా.. సినిమాలో పవన్ కు ధీటుగా ఇమ్రాన్ ఉండబోతున్నాడు అని సుజీత్ చూపించిన తీరు మాత్రం అదిరిపోయింది.


ఓమీ.. ఒక స్టైలిష్ విలన్. ఆ లుక్, డ్రెస్సింగ్, ఆ గాంభీర్యం. ఆ పాత్రకు ఇమ్రాన్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అని చెప్పొచ్చు. పవన్ కు తగ్గ విలన్ అని చూపించాడు సుజీత్. టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ కు వెళ్ళాకా.. బాలీవుడ్ మొత్తం నెమ్మదిగా టాలీవుడ్ కు షిఫ్ట్ అవుతుంది. అక్కడ స్టార్ హీరోలుగా నటించి మెప్పించిన హీరోలు.. సౌత్ లో విలన్స్ గా మారుతున్నారు. బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సైఫ్ ఆలీఖాన్, ఆమీర్ ఖాన్.. ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ.

OG రిలీజ్ తరువాత పవన్ కు ఎంత పేరు అయితే వస్తుందో ఇమ్రాన్ హష్మీకి కూడా అంతే పేరు వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా తరువాత అతని  పేరు టాలీవుడ్ లో మారు మ్రోగిపోతుంది. ఒకవేళ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా ఇమ్రాన్ పేరు బాగా వినిపిస్తుంది. అంత స్టైలిష్ విలన్ గా చూపించాడు సుజీత్. ఆ లెక్కన చూస్తే సౌత్ కు కొత్త విలన్ దొరికాడని కూడా చెప్పొచ్చు. మరి ఓమీ నట విశ్వరూపం చూడాలంటే OG వచ్చే వరకు ఆగాలి. సెప్టెంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Ajmal Ameer: సె** ఆడియో చాట్ పై స్పందించిన నటుడు.. నన్నేం చేయలేవంటూ కామెంట్స్!

Chiranjeevi: మెగా ఇంట దీపావళి.. ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్..ఫోటోలు వైరల్!

Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?

Mari Selvaraj: నేను నీకు మద్యం ఇవ్వడం లేదు, నా సినిమా అలా చూడకు

Ram Pothineni: అప్పుడు రామ్ చరణ్ ని చూస్తే జాలేసింది.. రామ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: రామ్ చరణ్ సెంటిమెంట్ మంత్, పెద్ది రిలీజ్ డేట్ కూడా కారణం అదేనా?

Mass Jathara : అర్థం పర్థం లేని పాటను రిలీజ్ చేసిన మాస్ జాతర యూనిట్

Actor Shivaji: సుధీర్ కి విలన్ గా శివాజీ.. మంగపతిని మించిన పాత్ర ఇది, ఇక వెండితెరపై రచ్చే

Big Stories

×