Ganesh Chaturthi Annadaanam: దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం అయితే అన్ని మండపాల దగ్గర భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాలతో కోలాహలం నెలకొంటున్నది. ప్రజలంతా గణపతి పందిళ్ల దగ్గరికి చేరి సందడి చేస్తున్నారు. ఇక నిజమజ్జనానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా మంది వినాయక మండపాల దగ్గర భక్తులకు అన్న వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది అభాగ్యులు అన్నవితరణ దగ్గరికి వచ్చి తమ కడుపులు నింపుకుంటున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఓ వినాయక మండపం దగ్గర అన్నదానం కోసం వచ్చిన వారికి భోజనంతో పాటు డబ్బులు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ కూడా అందజేశారు.
చేతిలో రూ. 100, కడుపు నిండా భోజనం
విశాఖపట్నంలోని దొండపర్తిలో స్థానికులు అంతా కలిసి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శివుడి రూపంలో ఉన్న గణపతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా అక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దేవుడిని దర్శించుకుని భోజనాల దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే తాగడానికి ఒక్కొక్కరికి ఒక్కో కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చారు. ఆ తర్వాత భోజనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి ముందుగా విస్తరి ఆకులు ఇచ్చారు. భోజనం పెట్టుకోవడానికి ముందు ప్లేట్ లో ఒక్కొక్కరికి రూ. 100 నోటు పెట్టారు. ఆ తర్వాత పులిహోర, బగారతో పాటు మూడు రకాల భోజనాలు పెట్టారు. పలు రకాల రుచికరమైన కూరలు కూడా వేశారు. అక్కడికి వచ్చిన ప్రతి భక్తులు వంద రూపాలు తీసుకోవడంతో పాటు కడుపు నిండా భోజనం చేశారు. చివరికి కూల్ డ్రింక్ తాగి నిర్వాహలను ఆశీర్వదించారు. అన్నట్లు ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేశారు.
Read Also: ఓరి నీ దుంపతెగా.. పాముకే నాగిని డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదరా!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఇక ఈ అన్నదానానికి సంబంధించిన వీడియోను కొంత మంది వైజాగ్ కుర్రాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కడుపు నిండా భోజనం పెట్టడంతో పాటు డబ్బులు, కూల్ డ్రింక్స్ ఇచ్చిన నిర్వాహకులపై అందరూ అభినందనలు కురిపిస్తున్నారు. నిజంగా అభినందించాల్సిన విషయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. “అన్నదానం చేయడం చాలా బాగుంది. డబ్బులు పంచడం కరెక్ట్ కాదు. ఎక్కువగా డబ్బులు ఉంటే రెండు రోజులు అన్నదానం చేయడం మంచిది. ఇంకా ఎక్కువ ఉంటే నవరాత్రులు అన్నదానం చేయండి. కానీ, డబ్బులు ఇవ్వకండి” అని మరికొంత మంది కామెంట్స్ చేశారు. “దొండపర్తి లో కుర్రాళ్ళు ఎప్పుడు సూపరే తగ్గేది లేదు” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read Also: స్కూల్ పై దావా వేసిన దొంగ.. నెలకు లక్షన్నర జీతం చెల్లిస్తున్న యాజమాన్యం!