BigTV English

Soubin Shahir: కూలీ నటుడికి హై కోర్టు బిగ్ షాక్… విదేశాలకు వెళ్లడానికి నో పర్మిషన్..

Soubin Shahir: కూలీ నటుడికి హై కోర్టు బిగ్ షాక్… విదేశాలకు వెళ్లడానికి నో పర్మిషన్..

Soubin Shahir: మలయాళ నటుడు మరియు నిర్మాత సౌబిన్ షాహిర్ కు ఎదురుదెబ్బ తగిలింది.  దుబాయ్ లో జరిగే అవార్డుల ప్రదర్శనకు హాజరు కావడానికి విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఎర్నాకుళం మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తిరస్కరించింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. జూన్ లో బ్లాక్ బాస్టర్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ కు సంబంధించిన మోసం బయట పడింది. దాంతో ఆయన పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. ఇటీవల ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, కేరళ హైకోర్టు ఫిటిషన్ దాఖలు చేశారు. అయితే అతనికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.


విదేశాలకు వెళ్ళడానికి నో పర్మిషన్..

మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఆర్థిక మోసాలు చేశారని ఫిర్యాదుతో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు ఇంకా అలానే ఉంది. అయితే ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రానికి గాను సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) అవార్డును అందుకోవడానికి ఆయనను ఆహ్వానించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.., బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ నటుడు కేరళ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు.. అయితే ఆయన పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దేశం వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని తేల్చి చెప్పేసింది. ఆ అవార్డును అందుకోవడానికి సౌబిన్ వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి మరొకరు వెళ్లి అవార్డును అందుకోనున్నారని సమాచారం.


Also Read : 50 రూపాయల కోసం ఆ పని.. కన్నీళ్లు తెప్పిస్తున్న యాక్టర్ వశిష్ఠ రియల్ లైఫ్..

అసలు కేసు ఎందుకంటే..?

2006 లో కోడైకానల్ లోని గునా గుహలలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం 2024 లో మలయాళ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లను కూడా కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 240.50 కోట్లు సంపాదించింది. మంజుమ్మెల్ బాయ్స్‌లో 7 కోట్లు పెట్టుబడి పెట్టిన సిరాజ్ వాలియవీటిల్ ఒక కేసు దాఖలు చేశారు. మొత్తం బడ్జెట్ 22 కోట్లు అవుతుందని తనకు సమాచారం అందిందని అయితే ఈ చిత్రంపై 18.65 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన వెల్లడించారు. తనకు వాగ్దానం చేసిన 40 శాతం లాభం తనకు చెల్లించబడలేదని  ఆరోపించారు.. దాంతో నిర్మాత పై కేసు నమోదు అయ్యింది. ఇప్పటికీ దీని విచారణ కొనసాగుతుంది.. ఇక సౌరబ్ ఇటీవల రజనీకాంత్ కూలీ చిత్రంలో నటించాడు. ఈయన చేసిన స్పెషల్ సాంగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే.. ప్రస్తుతం ఈయన రెండు భారీ ప్రాజెక్టు లకు సైన్ చేసినట్లు సమాచారం..

Related News

MLC Kavitha: సంతోష్‌ రావ్‌.. చిరంజీవి, ప్రభాస్‌లను కూడా మోసం చేశాడు..

Mirai First Review: సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్… ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ?

Gayatri Gupta: రోజూ అలాంటి టచ్ ఉండాల్సింది… లేకపోతే గాయత్రికి నిద్రపట్టదట

Allu Sirish: అన్నలా అవ్వడం కష్టం కానీ.. మనం రూట్ మారుద్దాం

Kishkindhapuri: ఎవరిని మోసం చేస్తారు.. ఆ సినిమాను మక్కీకి మక్కీ దించి.. ఒరిజినల్ అంటారేంటి

Shilpa Shetty: తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పాశెట్టి .. అదే కారణమా..?

Big Stories

×