BigTV English

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. ఈ స్మార్ట్ కిచెన్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అదే సమయంలో కమలాపురం, జమ్మలమడుగు, కడపలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్మార్ట్ కిచెన్ లను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మొత్తం 5 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటయ్యాయి. ఈ కిచెన్ ల ద్వారా సమీపంలోని 136 పాఠశాలలకు 13 వాహనాల ద్వారా భోజనం సరఫరా చేస్తారు. మొత్తం 10,332 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది.


స్మార్ట్ కిచెన్ అంటే ఏంటి..?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు అక్కడే వంట శాలలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే వాటిలో ఆధునిక సౌకర్యాలు అంతంతమాత్రమే. ఈ ఇబ్బందిని తొలగించేందుకు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ లను తెరపైకి తెచ్చింది. ఈ స్మార్ట్ కిచెన్ లు సమీప పాఠశాలలకు కూడా మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తాయి. ప్రతి స్మార్ట్ కిచెన్ లో ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు. వారి పర్యవేక్షణలో ఆహారాన్ని సిద్ధం చేస్తారు. సోలార్ పవర్ తో వంట వండుతారు. వంట విషయంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారు. ఒక్కో కిచెన్ కు అనుసంధానంగా ఒక్కో ఆర్వో ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు.

కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్లు..
డిసెంబర్ నాటికి కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొత్తం 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారాన్ని వీటి ద్వారా అందిస్తామని తెలిపారు మంత్రి లోకేష్. తల్లిదండ్రుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, తద్వారా స్మార్ట్ కిచెన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ కిచెన్ ను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడ సరుకుల నాణ్యత, భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. సీకే దిన్నె స్కూలు స్మార్ట్ కిచెన్ పనితీరునుబట్టి ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని తెలిపారు. శుచి, శుభ్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.


నాకు కూడా పరీక్షే..
సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదులను మంత్రి లోకేష్ పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఏడాది కాలంలో తాము తీసుకొచ్చిన మార్పులు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఆరా తీశారు. వారి నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించారు. కంప్యూటర్ ల్యాబ్, కొత్త బెంచీలు, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచడం వంటి సూచనలకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈసారి విద్యార్థులతో పాటు, విద్యాశాఖ మంత్రిగా తనకు కూడా పరీక్షే అని చమత్కరించారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో గత ఏడాదికాలంగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని, పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు. టీచర్లపై భారం మోపడంలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా భావించి వారికి మెరుగైన విద్యనందించాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగైన ఫలితాలకోసం మరిన్ని మార్పులు తెచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు లోకేష్.

Related News

Jagan-Vijayamma: కలసిపోయిన జగన్, విజయమ్మ.. కొడుకు, కోడల్ని ముద్దు పెట్టుకుని..

Lokesh vs Jagan: ఓరి నీ పాసుల గోల.. జగన్‌పై లోకేష్ సెటైర్లు, మేటరేంటి?

Jagan: ఏపీలో ఉల్లిమంటలు.. బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రొత్సహిస్తున్నారు-జగన్

Pulevendula: అందరి దృష్టి ఆయన పైనే.. షర్మిళ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

Amaravati News: పైసా మే ప్రమోషన్‌ చిచ్చు.. సాక్షి పత్రికపై కేసు నమోదు

Big Stories

×