BigTV English

Rashid Khan : ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం… 1100 మంది మృతి… తీవ్ర విషాదంలో రషీద్ ఖాన్.. భారీ సాయం ప్రకటన

Rashid Khan : ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం… 1100 మంది మృతి… తీవ్ర విషాదంలో రషీద్ ఖాన్.. భారీ సాయం ప్రకటన

Rashid Khan :  అఫ్గానిస్థాన్ లో నెలకొన్న భూకంపం తీవ్ర విశాలాన్ని మిగిలిచ్చినది. భూకంపం వల్ల ఇప్పటివరకు దాదాపు 1100 మందికి పైగా మరణించినట్లు ప్రభుత్వము వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. మరో 3500 మందికిపైగా గాయపడినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. భూకంప బాధితులకు 15 టన్నుల ఫుడ్ మెటీరియల్, ఒక వెయ్యి కుటుంబాలకు సరిపడే టెంట్లను పంపినట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడిన రోజు తన అన్నయ్య హాజీ అబ్దుల్ హలీం తుది శ్వాస విడిచారు. తీవ్రమైన కుటుంబ విషాదంలో ఉన్నప్పటికీ రషీద్ ఖాన్.. షార్జా వేదికగా పాకిస్తాన్ తో జరిగిన టి20 ట్రైపాక్షిక సిరీస్లో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో అఫ్గానిస్థాన్ 39 పారుగులతో ఓడిపోయినప్పటికీ.. రషీద్ ఖాన్ కేవలం 16 బంతులో 39 పరుగులు చేసి పోరాడాడు.


Also Read : Shubman Gill: గిల్ టాలెంట్ లేదు…మార్కెటింగ్ కోసమే ఆసియా కప్ లోకి తీసుకున్నారు…మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

వారి కోసం రషీద్ ఖాన్ సాయం


ఇక  ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు షాహిన్షా ఆఫ్రిది, ఫకర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్ వంటి ఆటగాళ్లు అఫ్గానిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. అక్కడ రషీద్ ఖాన్ కలిసి ఆయన సోదరుడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే అతని అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేశారు. ఈ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రీడాభిమానులు పాకిస్తాన్ జట్టు క్రీడా స్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. తాజాగా మారో మ్యాచ్ లో పాకిస్తాన్ టీమ్ ని  ఆఫ్ఘానిస్తాన్ ఓడించింది. ఇదిలా ఉంటె రషీద్ ఖాన్ భూకంప బాధితుల కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.    “విధ్వంసకర భూకంపం తర్వాత కునార్‌లో ఉన్న నా ప్రజల కోసం విరిగిపోయింది. బాధితులను ఆదుకోవడానికి నేను Found MEని ప్రారంభించాను.  ఇది ప్రతి విరాళం జీవితాలను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది. దయచేసి మాతో నిలబడండి” అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.

రషీద్ ఖాన్ రికార్డు 

రషీద్ ఖాన్ కెప్టెన్ గా అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు మంచి ఫామ్ లో దూసుకెళ్తోంది. ఆసియా కప్ లో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండో స్థానంలో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆ జట్టు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లను ఓడించిన విషయం తెలిసిందే. మరోవైపు రషీద్ ఖాన్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. రషీద్ కాను ఆల్ రౌండ్ షో కనబరుస్తున్నాడు. టి20 క్రికెట్లో ఇప్పటివరకు 165 వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు. యూఏఈ మ్యాచ్కు ముందు రెండు స్థానంలో కొనసాగిన రషీద్ ఖాన్ తర్వాత టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. మరోవైపు ఐపీఎల్ లో కూడా ఈ స్పిన్ను సంచలనం వికెట్ల వేటతో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంగేట్రం సీజన్లోనే ఛాంపియన్  నిలవడంలో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు అతను 149 వికెట్లు పడగొట్టడం విశేషం.

?igsh=MTFjdXY5dGx6ZGZnNw==

Related News

Virat Kohli : వివాదంలో కోహ్లీ ఫిట్ నెస్ టెస్ట్.. లండన్ లో పర్మిషన్స్ ఇస్తూ బీసీసీఐ షాకింగ్ నిర్ణయం

BCCI : స్పాన్సర్ విషయంలో బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఆ కంపెనీలన్నిటికీ చెక్.. గుట్కా, ఆన్ లైన్ గేమ్స్ కు ఇక ఎదురుదెబ్బ

Shubman Gill: గిల్ టాలెంట్ లేదు…మార్కెటింగ్ కోసమే ఆసియా కప్ లోకి తీసుకున్నారు…మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Irfan Pathan: మా కెరీర్ నాశనం చేసిన కిరాతకుడు.. ధోనిపై పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

Big Stories

×