BigTV English

Sajjala Ramakrishna: ముందుగానే ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది.. ఎందుకంటే: సజ్జల రామకృష్ణ

Sajjala Ramakrishna: ముందుగానే ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది.. ఎందుకంటే: సజ్జల రామకృష్ణ

Sajjala Ramakrishna Comments On Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వేలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు కేవలం ఎన్డీఏ కోసం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉందన్నారు. అందుకే కూటమిలో ఉన్న టీడీపీకి మేలు చేయాలని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఇచ్చారని  విమర్శించారు.


ఢిల్లీలో కూర్చుని ఇక్కడి ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా సరైన ఎగ్జిట్ పోల్స్ ఎవరూ చెప్పలేరని అన్నారు. లోకల్ సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పారన్నారు. ఎన్నికల కమిషన్ కూడా పక్షపాత దోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందుకే అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటోందని  మండిపడ్డారు.

ఎన్నికల్లో తాము గెలుస్తామని టీడీపీ హడావుడి చేస్తుందని అన్నారు. లోకల్ సర్వేలు వైసీపీ మళ్లీ గెలుస్తుందని స్పష్టంగా చెబుతున్నాయని వెల్లడించారు. అందుకే ఓటమికి తాము కారణాలు వెతుక్కోవలసిన అవసరం లేదని అన్నారు. 48 గంటల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ రూల్ ఎక్కడా లేని విధంగా ఏపీలో ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో మాత్రమే ఆ ప్రత్యేక వెసులుబాటు ఎందుకు అని అన్నారు. పిన్నెల్లికి బెయిల్ వస్తే మళ్లీ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.


Also Read: ఎగ్జిట్ ఫలితాలు తర్వాత, పీకె తొలిసారి రియాక్షన్

కౌంటింగ్ లో అక్రమాలు చేయాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. తెర వెనక కుట్ర చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో చెప్పాలని తెలిపారు. పాజిటివ్ ఓటు బ్యాంక్ తమ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడయితే స్వీట్ పంచుకోవడం కుదరదని టీడీపీ ముందుగానే సంబరాలు చేసుకుంటుందని చురకలు అంటించారు.

Tags

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×