BigTV English

Prashant Kishor reveals first reaction after exit polls: ఎగ్జిట్ ఫలితాలు తర్వాత, పీకె తొలిసారి రియాక్షన్

Prashant Kishor reveals first reaction after exit polls: ఎగ్జిట్ ఫలితాలు తర్వాత, పీకె తొలిసారి రియాక్షన్

Prashant Kishor reveals first reaction after exit polls: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అంచనాలు ఎలా ఉన్నాయి?  అధికార పార్టీ రూలింగ్‌లోకి వస్తుందా? లేక విపక్ష టీడీపీ మళ్లీ అధికారం సొంతం చేసుకుం టుందా? ఇదే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బలంగా చర్చించుకుంటున్నారు.


ఏపీ ప్రజలు మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదు. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారన్నది వాళ్లకు ముందుగానే తెలిసిపోయింది. అందుకోసమే శనివారం రాత్రి ఎగ్జిట్ పోల్స్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు.  ఎందుకంటే సర్వే సంస్థలు కూడా తమకు అనుకూలంగా ఉన్న పార్టీకు చెప్పడం మొదలుపెట్టాయి. జాతీయస్థాయిలో దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీయేకు పట్టం కట్టాయి.

ఇక ఏపీ విషయానికొస్తే మెజార్టీ సర్వే సంస్థలు కూటమి అధికారంలోకి రావచ్చని అంచనాలు వేశాయి. నాలుగైదు సంస్థలైతే అధికార పార్టీకే మళ్లీ పగ్గాలని చెప్పుకొచ్చాయి. దేశవ్యాప్తంగా లేదా, ఏపీలో ఎగ్జిట్ పోల్స్‌ను దగ్గరుండి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ గమనించారు. చివరకు రాత్రి పదిన్నర గంటలకు ఓ ట్వీట్ చేశారు.


కొందరు చేపట్టే అనవసర రాజకీయ చర్చలు టీవీల్లో వింటూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దని ప్రజలకు ఓ సలహా ఇచ్చేశారు పీకె అలియాస్ ప్రశాంత్‌ కిషోర్. ఈసారి ఎప్పుడైనా ఎన్నికలు, రాజకీయాలపై చర్చలు జరుగు తుంటే ఫేక్ జర్నలిస్టులు, నోరు పడేసుకునే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా మేధావుల పనికిమాలిన చర్చలు, విశ్లేషకులపై మీ టైమ్ వేస్టు చేసుకోవద్దని మనసులోని మాట బయట పెట్టారు. ఇంతకీ ఆయన ఎవర్ని అన్నట్లు చర్చ డిబేట్ జర్నలిస్టులు చర్చించుకోవడం మొదలైంది.

ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే 300పై చిలుకు సీట్లు గెలుస్తుందని ఎన్నికలకు ముందే చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఏపీలో కూడా ఈసారి అధికార ఫ్యాన్ పార్టీ ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడికే వస్తుందని చెప్పారు. పీకే చెప్పినట్టుగా జగన్ ఓడిపోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. నాలుగైదు సంస్థలు మాత్రమే జగనన్నకు అనుకూలంగా ఇచ్చాయి. ఇక మిగతా సంస్థలు, నేషనల్ మీడియా అంతా ఏపీలో కూటమి వైపు మొగ్గుచూపాయి. ఇవన్నీ గమనించిన తర్వాతే ప్రశాంత్‌కిషోర్ ఈ ట్వీట్ చేశారు. ఆయన అన్న మాటలు ఎవరికి తగులుతాయన్నది అసలు ప్రశ్న. మొత్తానికి రేపుమాపో ఓ ఛానల్‌ డిబేట్‌లో పీకే పాల్గొంటాడనే వార్తలు వస్తున్నాయి.

 

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×