BigTV English

3 Upcoming Sedans: మారుతీ, స్కోడా, హోండా నుంచి రానున్న కార్లు ఇవే!

3 Upcoming Sedans: మారుతీ, స్కోడా, హోండా నుంచి రానున్న కార్లు ఇవే!

3 Upcoming Sedans: భారత్ ఆటోమొబైల్ రంగంలో సెడాన్ కార్లకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి కార్లు బాగా పాపులర్ అయ్యాయి. అయితే రానున్న రోజుల్లో దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న మారుతీ సుజుకీ, హోండా, స్కోడా వంటి కంపెనీలు ఈ విభాగంలో 3 కొత్త కార్లను విడుదల చేయబోతున్నాయి. ఇందులో అనేక ప్రముఖ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లు కూడా ఉన్నాయి. రాబోయే 3 కొత్త కార్ల ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


Maruti Dzire Facelift
దేశంలోనే అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకీ అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ డిజైర్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే మారుతి డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది. అప్‌డేట్ చేయబడిన డిజైర్ కారు ఇంటీరియర్, ఎక్ట్సీరియర్‌లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇది కాకుండా కారు దాని పవర్‌ట్రెయిన్‌గా సరికొత్త 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ తీసుకురానుంది.

Also Read: బెస్ట్ ఆఫర్.. హోండా ఎలివేట్‌పై వేలల్లో డిస్కౌంట్!


New Gen Honda Amaze
హోండా అమేజ్ ప్రస్తుతం కంపెనీ అత్యంత తక్కువ బడ్జెట్ ధర కారుగా మార్కెట్‌లో ఉంది. ఇప్పుడు కంపెనీ అప్‌డేట్ చేసిన థార్డ్ జనరేషన్ హోండా అమేజ్‌ను రాబోయే నెలల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అడ్‌డేట్ చేసిన కారు లోపల, బయట భాగంలో పెద్ద మార్పులకు అవకాశం ఉంది. రీ మోడలింగ్ చేసిన తర్వాత హోండా అమేజ్‌లో 1.2-లీటర్ i-VTEC ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 90bhp పవర్‌ని 110Nm టాప్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.

Skoda Slavia Facelift
స్కోడా స్లావియా సంస్థ అత్యంత పాపులర్, అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఇప్పుడు కంపెనీ స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ను రాబోయే కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది టెస్టింగ్ సమయంలో మొదటిసారిగా ఇటీవల కనిపించింది. పవర్‌ట్రెయిన్‌గా కొత్త స్కోడా స్లావియా 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. రాబోయే సెడాన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేయవచ్చని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×