BigTV English

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీపై క్లారిటీ.. విజయమ్మ ఎటువైపు?

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కన్ఫామ్ అయింది. రెండు రోజుల్లో ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. షర్మిల భర్త అనిల్ ఇప్పటికే సోనియాగాంధీతో సమావేశమై, చర్చలు జరిపారు. త్వరలో పార్లమెంట్‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో షర్మిల పాత్ర ఎలా ఉండాలో కాంగ్రెస్ అధిష్టానం అనిల్‌కు క్లారిటీ ఇచ్చింది.

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీపై క్లారిటీ.. విజయమ్మ ఎటువైపు?

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కన్ఫామ్ అయింది. రెండు రోజుల్లో ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. షర్మిల భర్త అనిల్ ఇప్పటికే సోనియాగాంధీతో సమావేశమై, చర్చలు జరిపారు. త్వరలో పార్లమెంట్‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో షర్మిల పాత్ర ఎలా ఉండాలో కాంగ్రెస్ అధిష్టానం అనిల్‌కు క్లారిటీ ఇచ్చింది. రెండు వైపుల నుంచి ఆమోదముద్ర పడిన నేపథ్యంలో.. త్వరలోనే YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారామె.


ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించే అంశాన్ని పీసీసీ నేతలకు హైకమాండ్ సమాచారం ఇచ్చింది. వాళ్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. వైఎస్సార్ కూతురిని స్వాగతిస్తామంటూ అందరూ చెప్తున్నారు. సీఎం జగన్‌పైకి ఆయన చెల్లెల్ని ప్రయోగించబోతోంది కాంగ్రెస్.

ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తే ఆమె తల్లి విజయమ్మ ఎవరివైపు నిలుస్తారు? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. తాను ఏపీ రాజకీయాల్లోకి వెళ్లనంటూ గతంలో తన తల్లి విజయమ్మకు మాట ఇచ్చారు షర్మిల. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల తర్వాత ఆమె తన మనసు మార్చుకున్నారు. తాను రాజకీయంగా నిలబడాలంటే ఏపీలో ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు షర్మిల. మరి, విజయమ్మ తన కుమారుడి వైపు నిలుస్తారా?.. లేక తన కూతురికి మద్దతిస్తారా? అనే ప్రశ్నఉత్కంఠగా మారింది.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×