BigTV English

Jagan Vs Sharmila: జగన్ vs షర్మిళ.. రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ నిర్ణయమా? అసలు ఆ ఒప్పందంలో ఏముంది?

Jagan Vs Sharmila: జగన్ vs షర్మిళ.. రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ నిర్ణయమా? అసలు ఆ ఒప్పందంలో ఏముంది?

Jagan Vs Sharmila: వైఎస్ఆర్ ఆస్తుల వ్యవహారంపై రచ్చ కొనసాగుతుందా? చెల్లి వైఎస్ షర్మిలకు వాటాలు కొనసాగించేందుకు జగన్ ససేమిరా అంటున్నారా? ఇకపై కంపెనీలో వాటా ఇచ్చే ప్రసక్తి లేదని ఎందుకున్నారు? కంపెనీ ట్రిబ్యునల్ ఆశ్రయించడం వెనుక అసలేం జరిగింది? అన్నా-చెల్లి ఆస్తుల వివాదం మరింత ముదిరిందా? అవుననే సమాధానం వస్తోంది.


వైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతికి అనేక వ్యాపారాలున్నాయి. వాటిలో ఒకటి సరస్వతి పవర్ కంపెనీ. ఉమ్మడిగా జగన్-షర్మిల ఉమ్మడిగా ఉన్నప్పుడు స్థాపించిన కంపెనీ ఇది. వైసీపీ 2019లో అధికారంలోకి రాగానే ఆగష్టు 21న ఆ కంపెనీలో షర్మిలకు వాటా ఇస్తూ ఎంఓయూపై సంతకాలు చేశారు.

ఈ వ్యవహారంలో అన్నాచెల్లి కొద్దిరోజులు బాగానే ఉన్నా ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి అసలు విషయం మొదలైంది. ఈ వ్యవహారం వీరిద్దరి మధ్య రచ్చకు దారి తీసింది. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఆస్తుల వ్యవహారం ముదిరి పాకాన పడింది.


నెల కిందట జగన్, ఆయన భార్య కంపెనీ ట్రిబ్యునల్‌లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. షర్మిలకు గతంలో కేటాయించిన షేర్లను రద్దు చేయాలన్నది అందులోని ముఖ్యమైన సారాంశం. ఆ కంపెనీలో మా కుటుంబానికి 51 శాతం ఉందని డిక్లేర్ చేయాలని ప్రస్తావించారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం.. కంపెనీ నుంచి ఆర్ధిక లబ్ధి పొందుతున్న వారిని ఎవరినైనా తొలగించవచ్చు.

ALSO READ: మోసం  చేస్తారా.. తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన జగన్

జగన్ తన నిర్ణయం వెనుక కారణాలు అనేకమని తెలుస్తోంది. షర్మిల తన శ్రేయస్సు, కృతజ్ఞత లేకుండా తనను బాధించే ప్రయత్నం చేసిందన్నది ఆయన ఆలోచన. వీటిని రాజకీయాల్లోకి లాగడం, వ్యక్తిగత అపకీర్తిని తెచ్చిపెట్టింది. అన్నాచెల్లి మధ్య ప్రేమ, ఆప్యాయతలు పోయాయన్నది జగన్ మాట.

వ్యక్తిగతంగా ఆమె డిమాండ్ తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని భావిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ-అనురాగం ఉంటాయని తాను భావించడం లేదని, అందుకే వాటాలు బదిలీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీలో ఎలాంటి వాటా ఇవ్వనన్నది జగన్ మాట. దీనిపై షర్మిల విజయమ్మలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వెయిట్ అండ్ సీ.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×