BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : నోరు జారిన విష్ణు ప్రియ.. చరిత్ర సృష్టించబోతున్న ప్రేరణ..!

Bigg Boss 8 Telugu : నోరు జారిన విష్ణు ప్రియ.. చరిత్ర సృష్టించబోతున్న ప్రేరణ..!

Bigg Boss 8 Telugu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ లో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి కాగా 7 సీజన్లలో కూడా అబ్బాయిలే టైటిల్ విన్నర్ గా నిలిచారు. అయితే ఒక ఓటీటీ వెర్షన్ పూర్తి కాగా అందులో మొదటిసారి లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి (Bindu Madhavi)టైటిల్ విన్నర్ గా నిలిచింది. అయితే అది ఓటీటీ కి సంబంధించి.. కానీ టెలివిజన్ వెర్షన్ లో ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి అయితే అందరూ కూడా అబ్బాయిలే టైటిల్ విన్నర్ గా నిలిచారు. కానీ ఇప్పుడు తొలిసారి ఈ లెక్కలు మారబోతున్నాయని చెప్పవచ్చు. తాజాగా 8వ వారానికి సంబంధించిన ఓటింగ్ చూస్తే మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పవచ్చు.


శివంగిలా రెచ్చిపోతున్న లేడీ కంటెస్టెంట్… 

అసలు విషయంలోకెళితే సీజన్ 2, సీజన్ 3 మినహా మిగిలిన సీజన్స్ లో అమ్మాయిలు కనీసం రన్నర్ గా కూడా నిలవకపోవడం గమనార్హం. గత సీజన్లో అయితే టాప్ -5 లో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే నిలవగా.. ఇలాంటి పరిస్థితులలో ఒక అమ్మాయి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని, రికార్డ్ స్థాయిలో ఓటింగ్ ను సొంతం చేసుకుంది. టాస్కులు ఆడే విధానంలో లేడీ శివంగిలా విరుచుకుపడుతోంది. ఈ వారంతో టైటిల్ విన్నింగ్ రేస్ లోకి రావడం మాత్రమే కాదు టైటిల్ విన్నర్ స్పాట్ ని కూడా లాక్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ . హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేస్తున్నా.. ఆమె వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పి అవతలి వారు నోరు తెరవకుండా లాక్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


గట్స్ ఉన్న అమ్మాయిగా గుర్తింపు..

ఇప్పటికే ఆమె ఎవరో అర్థమయి ఉంటుంది కదా ఆమెనండి ప్రేరణ. శరీరం కందిబారినా అటు శారీరకంగా ఇటు మానసికంగా సిద్ధంగా ఉన్న ప్రేరణ ఫిజికల్ టాస్క్లలోనే కాదు బ్రెయిన్ ఛాలెంజ్ టాస్క్లలో కూడా నెగ్గుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా ఆడుతున్నది ఒక ప్రేరణ మాత్రమే అని చెప్పవచ్చు. తప్పు చేస్తే.. నిర్భయంగా తాను తప్పు చేశాను అని ఒప్పుకుంటుంది. ఒకవేళ తాను తప్పు చేయకపోతే బిగ్ బాస్ మాత్రమే కాదు హోస్ట్ నాగార్జున చెప్పినా కూడా వినదు.

బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి..

ఈ పాయింట్ నే పట్టుకొని హౌస్ లో కంటెస్టెంట్స్ చాలామంది నువ్వు నాగ్ సార్ మాట వినలేదు అంటే.. అవును నా పాయింట్ లో నేను కరెక్ట్ గానే ఉన్నాను అంటూ అవతలి వారిని లాక్ చేస్తుంది ప్రేరణ. ఇలాంటి ధైర్యం చూపించిన లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ లక్షణాలు ఉండడం వల్లే ఆడియన్స్ కు ఈమె తెగ నచ్చేస్తోంది. అందుకే అందరికంటే ఎక్కువ ఓట్లతో నేడు నంబర్వన్ స్థానంలో కొనసాగుతోంది.

వాస్తవానికి మొదటి వారం నుండి ఓటింగ్ లో పోటీ పడుతోంది ప్రేరణ. కానీ నిఖిల్, నబీల్ స్థాయిలో ఓటింగ్ పడేది కాదు. చాలా తేడా కూడా ఉన్నది. కానీ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమె.. నిఖిల్ ని భారీ మార్జిన్ తో క్రాస్ చేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. మరొకవైపు సీత ఎలిమినేషన్ విషయంలో విష్ణు ప్రియ ప్రేరణ ను టార్గెట్ చేయడం అటు ప్రేరణకు ప్లస్ గా మారింది. ఏది ఏమైనా టైటిల్ విన్నర్ గా నిలిచేది ఈమె అంటూ చరిత్ర సృష్టించేది ఈమె అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే గ్రాండ్ ఫినాలే వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×