BigTV English

YS Jagan: మోసం చేస్తారా.. తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన జగన్

YS Jagan: మోసం చేస్తారా.. తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన జగన్

YS Jagan: వైఎస్ ఫ్యామిలీ వార్ పీక్స్ కు చేరింది. జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై జగన్ ఏకంగా NCLTలో పిటిషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్ దంపతులు పిటిషన్ ఫైల్ చేసారు. షర్మిలకు గతంలో కేటాయించిన వాటాలను రద్దు చేయాలంటూ కోరారు. తమకు 51 శాతం వాటా ఉందని డిక్లేర్‌ చేయాలంటూ పిటిషన్లో తెలిపారు.


ఉమ్మడిగా ఉన్నప్పుడు స్థాపించిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధికి తామే కృషి చేసామనీ స్పష్టం చేసారు జగన్. అయితే.. షర్మిలకు వాటాలు ఇచ్చేందుకు గతంలో జగన్ అంగీకరించారు. అందులో భాగంగానే 2019 ఆగస్ట్ 21న అవగాహన వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాల చుట్టూ చాలా పెద్ద కథే నడుస్తోంది. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు కొత్తగా వచ్చి చేరిన వాటి పంపకాల విషయంలో ఈ ఇద్దరి మధ్య చాలా ప్రతిష్ఠంభన ఏర్పడింది. తల్లి విజయమ్మ కూడా సాల్వ్ చేయలేకపోయారు. వైఎస్ సన్నిహితులు చెప్పినా అప్పట్లో ఎవరూ వినలేదంటారు. కానీ ఇప్పుడు కథ మారింది. జగన్ ఎన్నికల్లో ఓడిపోయారు. కాలం కలిసి రావట్లేదు. రాజకీయంగా బలం తగ్గింది. ప్రత్యర్థులు బలం పుంజుకున్నారు. చెల్లెలు కూడా ప్రత్యర్థిగా ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. అందుకే ఇన్నాళ్లూ పక్కన పెట్టిన ఆస్తులు – పంపకాలు సబ్జెక్ట్ ను జగన్ ముందేసుకున్నారని అంటున్నారు.

వైఎస్ వారసులుగా ఆస్తులు చెరిసమానం వస్తాయని షర్మిల భావించారు. కానీ అలా జరగలేదు. అన్న కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు. రాజకీయ ప్రత్యర్థులతో కలబడ్డారు. పోరాటం చేశారు. ఆస్తుల్ని, కుటుంబాన్ని, పార్టీని కాపాడడంలో షర్మిల కీ రోల్ పోషించారు. అయినా సరే ఆస్తి పంపకాలు సరిగా జరగలేదన్న విషయంతో అన్న చెల్లి మధ్య స్టోరీ మారిపోయింది. ఎవరికి వారే అయ్యారు. రాజకీయంగానూ విబేధించుకున్నారు. అయితే మ్యాటర్ మరీ ముదరకుండా ఉండేలా వైఎస్ విజయమ్మ చొరవ తీసుకుని షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి పంపారు. జగన్ ఏపీకి పరిమితం అవగా, షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి కొంత కాలం నడిపారు. పాదయాత్ర కూడా చేశారు. కానీ ఇక్కడ పొలిటికల్ గా పట్టు దొరకబట్టుకోలేకపోయారు.


Also Read: ఆస్తుల మొత్తమెంత? చిక్కంతా వాటాల దగ్గరే.. రెండా, మూడా?

షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి పంపడం ద్వారా జగన్ కు ఏపీలో ఇబ్బంది రాకుండా విజయమ్మ కొంత వరకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అయితే ఆస్తి పంపకాల విషయంపై మాత్రం సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఈ ఇద్దరి మధ్య ఆస్తి విబేధాలు ఒక దశలో రాజకీయ ప్రత్యర్థులకు కూడా అస్త్రాలుగా మారాయి. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పులివెందుల వెళ్లినప్పుడు చంద్రబాబు కూడా జగన్-షర్మిల ఆస్తి పంపకాల విషయంపై ప్రచారంలో మాట్లాడారు. సొంత చెల్లికే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించడం ద్వారా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆస్తుల్లో ఆడబిడ్డకు అన్యాయం చేశారని బహిరంగంగానే మాట్లాడారు.

 

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×