E-Paper
Advertisement

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్ సెల్ఫీ వీడియో, ఏం జరుగుతోంది?

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్ సెల్ఫీ వీడియో, ఏం జరుగుతోంది?
Advertisement

Viveka Murder Case: సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసు జోరుగా దర్యాప్తు చేస్తోంది సీబీఐ. ఏం జరిగిందో తెలీదుగానీ రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై సెల్పీ వీడియో విడుదల చేశాడు ఈ కేసులో ఏ-2 నిందితుడు సునీల్ యాదవ్. ఇంతకీ వీడియోలో ఏం చెప్పాడు?

వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్ సెల్ఫీ వీడియో

Advertisement

సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక అంశాలపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ దర్యాప్తు చేస్తోంది సీబీఐ. ఏం జరిగిందో తెలీదుగానీ ఇటీవలకాలంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఈ వ్యవహారంపై సెల్పీ వీడియో విడుదల చేశారు ఈ కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్. నాలుగు రోజులుగా టీవీ ఛానల్‌లో సునీత దంపతులు మాట్లాడుతున్నారు.

విశ్రాంత ఏఎస్పి రాజేశ్వర్‌రెడ్డికి హెచ్చరిక జారీ చేశాడు సునీల్ యాదవ్. ఈ కేసులో సునీల్ యాదవ్ మాస్టర్ మైండ్, చీటర్ అంటూ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఎనిమిది మంది నిందితుల గురించి మాట్లాడాలని సవాల్ విసిరాడు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ విధంగా ఛానల్స్‌లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నావని మండిపడ్డారు.

Advertisement

మాజీ పోలీసు అధికారిని హెచ్చరించిన సునీల్ యాదవ్

మీడియాలో కోర్టు ట్రయిల్ నడుపుతున్నావని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసుకొని మీడియాలో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కోర్టు ముందు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీస్ అధికారిగా పని చేసిన మీకు, ఈ మాట్లాడకూడదని తెలియదా? పులివెందులలో సిఐగా పని చేసిన మీకు ఇదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

త్వరలో విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఎవరి మెప్పు పొందడానికి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఎవరికి భయపడే వాడ్ని కాదని, తనపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. జరుగుతున్న పరిణామాలు సునీత కుటుంబసభ్యులు గమనిస్తున్నారు.  ఈ వ్యవహారంలో ఏదో జరుగుతుందన్న వాదనలు బలపడుతున్నాయి.

ALSO READ: ఏపీలో క్రెడిట్ చోరీ కంటిన్యూ .. మిట్టల్ స్టీల్ ప్లాంట్ మావల్లే- మాజీ మంత్రి అమర్నాథ్

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×