BigTV English

Jagan: పరామర్శకు ఎప్పుడొస్తావ్ జగన్.. టీడీపీ సూటి ప్రశ్న

Jagan: పరామర్శకు ఎప్పుడొస్తావ్ జగన్.. టీడీపీ సూటి ప్రశ్న

పరామర్శ పేరుతో ఈరోజు సత్తెనపల్లి మండలంలో బలప్రదర్శన చేపట్టారు జగన్. ఈ పర్యటనలో మరో ఇద్దరు చనిపోయారు. ఒకరి పరామర్శకు వచ్చి మరో ఇద్దర్ని జగన్ పొట్టనపెట్టుకున్నారంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎప్పుడో ఏడాది క్రితం, వైసీపీ పాలనలో బెట్టింగ్ ఆడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి ఇప్పుడు జగన్ శవ రాజకీయం చేస్తున్నారని.. మరి ఈ పర్యటనలో చనిపోయిన ఇద్దరి కుటుంబాల్ని ఆయన ఎప్పుడు పరామర్శిస్తారంటూ టీడీపీ ప్రశ్నించింది. ఈరోజు జగన్ యాత్రలో, ఇద్దరి ప్రాణాలు పోయాయని, ఈ యాత్రలు ముగిసే లోపు ఇంకా ఎంత మందిని చంపుతావంటూ టీడీపీ నేతలు నిలదీశారు. జగన్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేది ఎవరని ప్రశ్నించారు టీడీపీ నేతలు.


ఇద్దరు మృతి..
జగన్ పర్యటన కారణంగా ఈరోజు ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఉదయం జగన్ కాన్వాయ్ వాహనాల వెనక వచ్చిన వైసీపీ నేతలకు చెందిన ఓ ప్రైవేట్ వాహనం ఢీకొనడంతో సంగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. వాహనం ఢీకొని పడిపోయిన అతడిని కొంతసేపటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా వైసీపీ నేతలెవరూ ఆ వైపుకి రాలేదని అంటున్నారు. పోలీసులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు, అతని చనిపోయాడు. ఇక సత్తెనపల్లి గడియార స్తంభం వద్ద వైసీపీ కార్యకర్త ఒకరు సొమ్మసిల్లి కింద పడిపోయాడు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈరెండు ఘటనలపై కనీసం వైసీపీ స్పందించలేదని టీడీపీ మండిపడుతోంది. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన జగన్, మరి ఈ రెండు కుటుంబాలను ఎప్పుడు పరామర్శిస్తారంటూ సూటిగా ప్రశ్నించింది.

జగన్ పర్యటనపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. సత్తెనపల్లి పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చారు. కాన్వాయ్ లో వాహనాలతోపాటు, జగన్ వెంట పరిమితంగానే కార్యకర్తలు ఉండాలని సూచించారు. కానీ అక్కడ జరిగింది వేరు. నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తల్ని తరలించారు. అంబటి వంటివారు బ్యారికేడ్లను తోసుకుని వెళ్లారు. ముందునుంచీ హెచ్చరిస్తున్నా కూడా జగన్ కావాలనే బలప్రదర్శన చేస్తున్నట్టుగా జనంలోకి వస్తున్నారని, దానివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ విమర్శిస్తోంది. జగన్ ఎక్కడికి పర్యటనకు వెళ్లినా అక్కడ వైసీపీ సైకోల వీరంగమే కనిపిస్తోందని టీడీపీ ట్వీట్ వేసింది. జగన్ కావాలనే ఉన్మాదులను రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోందని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని జగన్ చూస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల పైనా, పోలీసులపైనా దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రోజు రోజుకి పెచ్చుమీరుతున్న వైసీపీ ఉన్మాదుల పట్ల చర్యలు తప్పవని టీడీపీ హెచ్చరించింది.

జగన్ పర్యటన సక్సెస్ అయిందని వైసీపీ ప్రచారం చేసుకోవడం కూడా విచిత్రంగా తోస్తోంది. అసలు పరామర్శ పర్యటన సక్సెస్ అవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పరామర్శ యాత్రలను విజయ యాత్రలుగా చేయడం మంచిది కాదని అంటున్నారు. జనం రోడ్లపై గుమికూడి, జగన్ కి జేజేలు పలకడమేంటని నిలదీస్తున్నారు. మరి వైసీపీ ఇంకా ఇలాంటి పర్యటనలను కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ పరామర్శకు జగన్ వచ్చినా, దాన్ని మరీ అంత ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడం మంచిది కాదని నెటిజన్ల సలహా.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×