Solo Boy Trailer: బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ (Gautham Krishna)హీరోగా సోలో బాయ్ (Soloboy) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను కూడా పెంచేస్తుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్బాయి జీవితంలో ఎలా సక్సెస్ సాధించారు. ఈ సక్సెస్ సాధించడంలో తను ఎదుర్కొన్న అవమానాలు, అలాగే డబ్బు లేదని తన ప్రేమను రిజెక్ట్ చేయడం వంటి సన్నివేశాలను చూపించారు. ఇలా ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కుర్రాడు అవమానాలను ఎదుర్కొని ఎలా జీవితంలో ఎలా సక్సెస్ అందుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది.
మధ్యతరగతి కుర్రాడు..
ఇక ఈ ట్రైలర్ లో ఒక మిడిల్ క్లాస్ లో పుట్టిన కుర్రాడు కాలేజీ జీవితాన్ని ఎలా అనుభవించాడు చదువుల తర్వాత ఉద్యోగం కోసం ఎలా పోరాటం చేశారా అనే సన్నివేశాలను చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉందని చెప్పాలి. అయితే ఈ విధమైనటువంటి జానర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మరి సోలో బాయ్ గా వస్తున్న గౌతం కృష్ణ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్..
ఈ సినిమాలో గౌతమ్ కి జోడిగా రమ్య పసుపులేటి, (Ramya Pasupuleti)శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ సినిమాపై మంచి అంచనాలను పెంచుతున్నారు. మరి హీరోగా రెండవ సినిమాతో రాబోతున్న గౌతమ్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక గౌతమ్ ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గౌతమ్ బిగ్ బాస్ 7,తో పాటు 8 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సీజన్ 8 లో గౌతమ్ రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో రాబోతున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. ఇక గౌతమ్ కృష్ణకు ఇది రెండవ సినిమా కావటం విశేషం ఇదివరకే ఈయన ఆకాశ వీధుల్లో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న గౌతం సోలోభాయిగా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తారో చేయాల్సి ఉంది.
Also Read: Pooja Hegde: కెరియర్ కష్టాలు.. మళ్లీ వారిని గోకుతున్న పూజ.. ఎంత కష్టమొచ్చింది?