OTT Movie : ఒక యువతి అదృశ్యం కావడం… ఆమెను వెతికే ఒక డిటెక్టివ్ బృందం… అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ ట్విస్టులతో ఈ సినిమా నడుస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయిన మూడేళ్ళ తరువాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో కార్తీక అనే మహిళ ఆకస్మికంగా అదృశ్యమవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఆమె మిస్సింగ్ వెనుక దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఒక ఉత్కంఠభరితమైన రైడ్ గా, చివరి క్షణం వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇంతకీ కార్తీక మిస్సింగ్ వెనుక అసలు కారణం ఏమిటి ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ కార్తీక (ఆనంది) అనే యువతి మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ మిస్సింగ్ తొలుత సాధారణంగా కనిపించినప్పటికీ, ఒక డిటెక్టివ్ (కథిర్) అతని బృందం (నరేన్, జోజు జార్జ్) ఈ కేసును పరిశోధించడం ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తు లోతుగా వెళ్ళే కొద్దీ, కార్తీక గురించి షాకింగ్ రహస్యాలు బయటపడతాయి. ఆమె ఎవరు ? ఆమె జీవితంలోని దాగిన కోణాలు ఏమిటి ? ఆమె ఆర్థిక లావాదేవిలకు ఎలా బలైంది అనే విషయాలు బయటపడతాయి. కథలో ఒక వైపు కార్తీక వ్యక్తిగత జీవితం. మరో వైపు ఆమె భర్తతో జరిగిన మోసపూరిత వివాహం, వివాహేతర సంబంధం కూడా ఈ కేసులో అనుమానస్పదంగా ఉంటాయి.
ఇక ఈ కేసులో డిటెక్టివ్ బృందం ఎదుర్కొనే గందరగోళ సవాళ్లు, ఊహించని ట్విస్ట్‌లు కథను ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి. స్క్రీన్‌ప్లే కూడా ఈ స్టోరీకి ప్రధాన బలం, ఇది మొదట నిదానంగా అనిపించినప్పటికీ, రెండవ భాగంలో థ్రిల్లింగ్ అంశాలతో వేగం పుంజుకుంటుంది. సినిమా సరోగసీ అనే సున్నితమైన అంశాన్ని కూడా తాకుతుంది. అయితే దానిపై లోతుగా వెళ్లకపోయినా, ఇది కథకు ఒక ఆసక్తికరమైన లేయర్‌ను జోడిస్తుంది. విమర్శకులు ఈ సినిమాను విద్యా బాలన్ నటించిన కహానీతో పోల్చారు. కానీ దర్శకుడు జాక్ హారిస్ తన స్వంత ట్విస్ట్‌లతో కథను ప్రత్యేకంగా నడిపించాడు. చివరికి కార్తీక ఏమవుతుంది ? డిటెక్టివ్ బృందం వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? భర్త ప్రమేయం ఎంత ఉంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఒళ్లు గగుర్పొడిచేలా మరణాలు… వెంట్రుక వాసి తప్పుతో గాల్లోకి ప్రాణాలు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ మర్డర్ మిస్టరీ మూవీ పేరు ‘కార్తీక మిస్సింగ్ కేస్'( Karthika Missing Case). 2025 లో వచ్చిన ఈ సినిమాకి జాక్ హారిస్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంది, కథిర్, నరేన్, పవిత్ర లక్ష్మి, జోజు జార్జ్, నట్టి సుబ్రమణియం ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.8/10 రేటింగ్ ఉంది. 2025 జూన్ 13 నుంచి Aha OTTలో డిజిటల్ ప్రీమియర్ కి వచ్చింది.