E-Paper
Advertisement

Bengaluru: బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన, అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు, ఆపై ఆ పార్టీ రియాక్షన్

Bengaluru: బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన, అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు, ఆపై ఆ పార్టీ రియాక్షన్
Advertisement

Bengaluru: హైదరాబాద్‌కు చెందిన కమెడియన్ శరత్ ఉదయ్ షోకు అంతరాయం కలిగింది. బెంగుళూరులో ఏర్పాటు చేసిన ఓ షోను కొంతమంది టీడీపీ మద్దతుదారులు అడ్డుకోవడం కలకలం రేపింది. టీడీపీ మద్దతుదారులుగా చెబుతున్న కొందరు వ్యక్తులు శరత్ షోను అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన 

Advertisement

హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్. తన ప్రదర్శనలతో లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నారు. అయితే శనివారం ఆయన బెంగళూరులో ఏర్పాటు చేసిన షోకు అంతరాయం ఏర్పడింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై దాదాపు రెండేళ్ల కిందట తనదైనశైలిలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలుస్తోంది.

దానికి నిరసనగా టీడీపీ మద్దతుదారులుగా చెబుతున్న కొందరు వ్యక్తులు శరత్  కామెడీ ప్రదర్శనను అడ్డుకున్నారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో జరిగిన ఈ షోకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  శనివారం సాయంత్రం కమెడియన్ శరత్ ఉదయ్ తన ప్రదర్శన ప్రారంభించారు. కొద్దిసేపటికే షోలో గందరగోళం నెలకొంది.

Advertisement

ఆడియన్స్‌ల్లో ఓ వ్యక్తి వేదిక వద్దకు వచ్చి గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతడికి మరికొందరు జతకలిశారు. ఇరువురు మధ్య మాటల వాగ్దాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శరత్ ఉదయ్ టీమ్‌‌పై దూషణలకు దిగారు కొంతమంది టీడీపీ మద్దతుదారులు. దాడి చేస్తామని హెచ్చరించినట్టు సమాచారం.

అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు, ఆపై ఆ పార్టీ రియాక్షన్

2003లో చంద్రబాబుపై నక్సలైట్లు జరిపిన హత్యాయత్నం గురించి శరత్ తనదైనశైలిలో వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి జోకులు రిపీట్ చేయవద్దని తీవ్రంగా హెచ్చరించారు. టీడీపీ నేతల గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడవద్దని సూచన చేశారు. పార్టీ నేతలకు అనుకూలంగా నినాదాలు చేయాలని బలవంతం చేశారు.

అందుకు కమెడియన్ నిరాకరించారు. తాను చేసిన కామెడీలో టీడీపీ కాకుండా ఇతర పార్టీల ప్రస్తావన ఉందని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు వేదిక మీద శరత్ ఉదయ్‌తో క్షమాపణ చెప్పించారు. ఈ వ్యవహారం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఘటనా స్థలం నుంచి ఆ వ్యక్తులు వెళ్లిపోయారు.

ALSO READ: ఏపీలో ఇంధన సంక్షోభంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వారికి పెట్రోల్, డిజిల్ పోయొద్దు!

మరోవైపు బెంగుళూరు శరత్ కామెడీ గురించి టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఇలాంటి నిరసనలు పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఏ చర్యను సమర్థించబోమన్నారు. అదే సమయంలో కమెడియన్లు, కళాకారులు, రాజకీయ విశ్లేషకులను సున్నిహితంగా హెచ్చరించారు.

సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. భావప్రకటన పేరుతో హద్దులు దాటితే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందన్నారు. ప్రముఖులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ద్వారా గుర్తింపు పొందవచ్చని కొందరు భావిస్తున్నారని, అది పూర్తిగా తప్పని వ్యాఖ్యానించారు పల్లా శ్రీనివాసరావు.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×