E-Paper
Advertisement

Amaravati News: అమరావతిలో మంత్రి సీతారామన్ .. రాత్రి సీఎం ఇంట్లో డిన్నర్, బ్యాంకులకు శంకుస్థాపన

Amaravati News: అమరావతిలో మంత్రి సీతారామన్ .. రాత్రి సీఎం ఇంట్లో డిన్నర్, బ్యాంకులకు శంకుస్థాపన
Advertisement

Amaravati News: ఏపీలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం రాజధాని భవనాల పనులు మాత్రమే కాదు.. పలు కేంద్ర సంస్థల పనులు జోరందుకున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అమరావతి చేరుకున్నారు. ఆమెకు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.

అమరావతిలో ఆర్థికమంత్రి సీతారామన్

Advertisement

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. గురువారం ఆమె అమరావతికి చేరుకున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు డిన్నర్‌కు ఆహ్వానించారు. గురువారం రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్రమంత్రి సీతారామన్‌కు సిఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేష్‌ దంపతులు స్వాగతం పలికారు.

శుక్రవారం అమరావతిలో పలు బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు.  ఏపీ రాజధాని అమరావతి సరికొత్త కళ సంతరించుకుంటుంది. ఇకపై జాతీయ, పలు ఆర్థిక సమస్థలకు అమరావతి చిరునామాగా మారనుంది. శుక్రవారం నాడు ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆఫీసుల నిర్మాణాలను శంకుస్థాపన చేయనున్నారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్.

Advertisement

గతరాత్రి సీఎం చంద్రబాబు ఇంట్లో డిన్నర్

శుక్రవారం ఉదయం 11.22 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆయా కార్యాలయాల కోసం ఇప్పటికే భూమిని కూడా కేటాయించింది చంద్రబాబు సర్కార్. అమరావతిలో మొత్తం 27.855 ఎకరాల భూములను కేటాయించింది. బ్యాంకులు ఆఫీసుల భవనాలకు దాదాపుగా 9.6 ఎకరాలు ఇచ్చారు.

వాటిలో ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, నాబార్డు, యూనియన్‌ బ్యాంకు సహా డజను బ్యాంకులున్నాయి. అలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-ఆర్‌బీఐ, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌-ఎల్‌ఐసీ, ఆదాయపు పన్నుశాఖ వంటి కీలకమైన సంస్థల కోసం దాదాపు 5.8 ఎకరాలు కేటాయించింది ఏపీ ప్రభుత్వం.

ALSO READ: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, ఫైబర్ గ్రిడ్ కేసు క్లోజ్

దీనికితోడు సిబ్బంది వసతికి 7.02 ఎకరాలు, అనుబంధ సంస్థల ఉద్యోగుల నివాసాలకు మరో 4.54 ఎకరాలు కేటాయించింది. ఆయా జాతీయ సంస్థల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు అమరావతికి వచ్చాయి. అంతేకాదు దాదాపు 6 వేల ఉద్యోగాలు రానున్నాయి. బ్యాంకు ఆఫీసులు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం వంటి ప్రాంతాల్లో రానున్నాయి.

ఇదిలా ఉండగా గురువారం అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గతంలో కేంద్రం ఇచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గడువు పూర్తి అయ్యింది. దాన్ని పెంచాలని కోరారు. ఈ విషయాన్ని శుక్రవారం భేటీలో ఆర్థికమంత్రి సీతారామన్ దృష్టికి తేనున్నారు సీఎం చంద్రబాబు. దీనికితోడు పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధానానికి ఆర్థిక సహకారం చేయాలని కోరనున్నారు. దీనికితోడు పోలవరం ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పూర్తి, పునరావాస కార్యక్రమాలకు అడ్వాన్సుగా నిధులు మంజూరు చేయాలని కోరే అవకాశం ఉంది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×