E-Paper
Advertisement

Crime News: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా.. ఎవరూ ఊహించని రీతిలో భార్యను చంపిన భర్త

Crime News: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా.. ఎవరూ ఊహించని రీతిలో భార్యను చంపిన భర్త
Advertisement

Crime News: రోజు రోజుకు మనుషులు క్రూరత్వంగా మారుతున్నారు. సొంత వాళ్లు అని కూడా చూడకుండా దారుణంగా హత్య చేస్తున్నారు. ఇక్కడ ఓ మృగం కట్టుకున్న భార్యకు అతి క్రూరంగా నరకం చూపించి హత్య చేశాడు. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని అత్తిబెలెలో జరిగింది. అయితే 37 ఏళ్ల విద్య అనే గృహిణి, తన భర్త బసవరాజు, అతని తండ్రి మారిస్వామచారి చేత పాదరసం ఇంజెక్షన్ చేయించి, తొమ్మిది నెలల పాటు తీవ్రంగా నరకం చూయించారు. చివరికి, విక్టోరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై అత్తిబెలె పోలీసులు బసవరాజు అతని తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే విద్య, బసవరాజు 2020 మే 18న వివాహం చేసుకున్నారు. ఇద్దరూ అత్తిబెలెలోని తిలక్‌నగర్‌లో నివసిస్తున్నారు. వారికి 4 ఏళ్ల ఒక కుమారుడు ఉన్నాడు. బసవరాజు ఒక వ్యాపారవేత్త, విద్య ఇంట్లోనే ఉంటుంది. కానీ వివాహం తర్వాత బసవరాజు విద్యపై క్రూరమైన దిగ్భ్రాంతి ప్రదర్శించాడు. విద్య తన మరణ వాంగ్మూలంలో చెప్పినట్లుగా, వివాహం రోజు నుంచే బసవరాజు తనను “పిచ్చి” అని అవమానిస్తూ, ఇంట్లో బందీ చేసి, బంధువులను కలవకుండా చేశాడు. పొరుగువారికి “ఆమె మానసిక అని చెప్పి, ఆమెను మరింత దూరం చేశాడు. దోహదం కోసం బసవరాజు, అతని తండ్రి ఆమెపై దాడి చేశారని విద్య ఆరోపించింది.

Advertisement

విద్య మరణించే ముందు తన మరణ వాంగ్మూలాన్ని బయటపెట్టింది. అయితే సాధారణంగా రోజు తనను తిట్టే బసవరాజు ఫిబ్రవరి 26న ప్రేమగా ప్రవర్తించాడు. అప్పుడు విద్య భయపడ్డా, అతని మాటలకు నమ్మి పడుకుంది. కానీ, తదుపరి రోజు సాయంత్రం మేల్కొని, కుడి తొడలో తీవ్రమైన నొప్పి అనుభవించింది. అంతేకాకుండా తొడలో ఇంజెక్షన్ గాయం కనిపించింది, కాలు వాబు పెరిగి నడక కష్టమైంది. బసవరాజు దీన్ని “అది ఏమీ కాదు” అని తప్పించాడు. కానీ విద్య భయపడి, తన తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది.

Also Read: కాక రేపుతున్న కవిత కట్టిన కోక.. కాంగ్రెస్‌లో చేరడం ఖాయమా! 

Advertisement

అలాగే బసవరాజు ఆమెకు రోజు పాదరసాన్ని ఇచ్చేవాడు. కానీ అందులో క్లోరోఫాం, సిరంజిలు కలిపి ఇచ్చేవాడు. ఈ పాదరసం తాగిన తర్వాత విద్య పరిస్థితి తీవ్రమై ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ రక్త పరీక్షలు చేయగా అప్పుడు అసలు నిజం బయటపడింది. ఈ పాదరసం తాగడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు ఒక్కొక్కటిగా పాడవుతూ వచ్చాయి. దీంతో విద్య తీవ్ర నరకం అనుభవించింది. లాస్ట్‌కు ఆమె పిరిస్థితి తీవ్రమై ఆసుపత్రికి విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్య మరణించే ముందు పోలీసులకు తన భర్తపై కేసు పెట్టి అసలు నిజాలు అప్పుడు బయటపడ్డాయి. దీంతో పోలీసులు భర్త బసవరాజు, అతని తండ్రి మారిస్వామచారిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరిని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×