BigTV English

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?

Tirupati: ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపిన ఘటన తిరుపతిలోని చిగురువాడలో చోటు చేసుకుంది. ఐదు నెలలు క్రితం వెడురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లికి చెందిన 30ఏళ్ల గోవింద్ ని తిరుపతి రూరల్ చిగురువాడకి చెందిన మానసతో వివాహాం జరిగింది.పెళ్లైన నాటి నుంచి మానస వేరుగా కాపురం పెట్టాలని గోవింద్ పై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ఇక చేసేదేమి లేక తిరుపతి రూరల్ లో చిగురువాడలో భార్య మానసతో కలిసి వేరుగా కాపురం ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే కొత్త ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.


పెళ్ళికి ముందే మరొక వ్యక్తి ని ప్రేమించిన మానస.. పెళ్ళి తర్వాత ప్రియుడ్ని పెళ్ళి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. దీంతో ప్రియుడు మానసతో కలిసి గోవిందు నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి గొంతు నులిమి హత్య చేశారు. తన భర్త అప్పుల బాధలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుని మరణించాడని కుటుంబ సభ్యులను, అందరినీ మానస నమ్మించింది.

అంత్యక్రియలు కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా..గోవింద్ మెడపై గాయాలు ఉండటంతో కుటుంబసభ్యలకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు గోవిందుది సాధారణ మరణం కాదని హత్య అని పోలీసులు నిర్ధారించారు.


Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×