E-Paper
Advertisement

నా పెళ్ళాం నిప్పు రా.. వైరల్ అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్!

నా పెళ్ళాం నిప్పు రా.. వైరల్ అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్!
Advertisement

Bellamkonda srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత కొడుకుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈయన ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహం ఏప్రిల్ 29 వ తేదీ తిరుపతిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సాంప్రదాయ పద్ధతి ప్రకారం వీరి వివాహపు వేడుకలు జరిగాయి.

ఘనంగా శ్రీనివాస్ కావ్య వివాహం..

ఇలా పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యల వివాహం తిరుపతిలో జరగడంతో కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. ఇలా తిరుపతిలో వివాహం చేసుకున్న ఈ జంట మే ఒకటవ తేదీ హైదరాబాదులో చాలా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా సినీ ప్రముఖులు మొత్తం హాజరై సందడి చేశారు.

ప్రపంచమా నా భార్యను కలుసుకో..

Advertisement

ప్రస్తుతం వీరి పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన భార్య గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు. ఇప్పటివరకు నేను కనుగొన్న వాటన్నింటి కంటే గొప్ప దాన్ని కనుగొన్నాను.. ప్రపంచమా నా భార్యను కలుసుకో అంటూ ఈయన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఈయన “నా పెళ్ళాం నిప్పు రా” అంటూ జయ జానకి నాయక సినిమాలోని డైలాగ్ రిక్రియేట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది.

Advertisement

తన భార్య గురించి ఎంతో గొప్పగా ఎలివేషన్ ఇస్తూ తన భార్య నిప్పు అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పడంతో అన్న సోషల్ మీడియా మీమ్స్ బాగా ఫాలో అవుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అన్న నిప్పుతో జాగ్రత్త ఇటీవల కాలంలో చాలామంది తగలబడి పోతున్నారు అంటూ ఫన్నీగా ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన భార్య పట్ల తనకున్నటువంటి ప్రేమను ఇలా చాటి చెబుతూ ఈ పోస్ట్ చేశారని తెలుస్తుంది. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో అంగర వైభవంగా వివాహం జరుపుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Also Read: రష్మీ పై వైసీపీ నేతలు ట్రోల్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన యాంకరమ్మ .. తగ్గేదేలేదంటూ!

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×