TVS Apache vs Ronin Updates: భారత మార్కెట్లో స్పోర్టీ బైక్స్ సెగ్మెంట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టీవీఎస్ మోటార్ కంపెనీ తన బైక్‌లను మరింత అప్‌డేట్ చేసింది. అపాచీ, రోనిన్ సిరీస్ లో కొత్త వేరియంట్లను తీసుకురావడంతో పాటు, ఇప్పటికే ఉన్న మోడళ్లలో కొత్త టెక్నాలజీ, సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లను యాడ్ చేసింది. కొత్త బైక్‌ల డెలివరీలు ఈ పండుగ సీజన్‌లో ప్రారంభం కానున్నాయి.
అపాచీ RTR 160కి కొత్త టాప్ వేరియంట్‌ను టీవీఎస్ పరిచయం చేసింది. దీని ధర రూ.1.28 లక్షలుగా నిర్ణయించారు. ఈ వేరియంట్‌లో ట్రాక్షన్ కంట్రోల్, హజార్డ్ లైట్లు, LED ఇండికేటర్లు లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. నాలుగు కలర్ ఆప్షన్స్ తో అందుబాటులోకి వచ్చింది. రోజువారీ ప్రయాణంతో పాటు స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడే వారికి ఈ కొత్త వేరియంట్ లో ఫీచర్లు మరిన్ని పెరిగాయి.
అపాచీ RTR 160 4V కొత్త టాప్ వేరియంట్ ధర రూ.1.41 లక్షలు. ఈ మోడల్‌లో టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ లావటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ ద్వారా రైడింగ్ సమయంలో నావిగేషన్‌ను మరింత సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ బైక్ కూడా నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
అపాచీ RTR 200 4V కొత్త టాప్ వేరియంట్ ధర రూ.1.50 లక్షలు. ఇందులో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు అడ్జస్టబుల్ ఫ్రంట్ USD ఫోర్క్ ను అందించారు. ఈ బైక్‌ను దేశంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన 200cc మోటార్ సైకిల్‌గా టీవీఎస్ ప్రకటించింది. ఇది కూడా నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. తక్కువ కెపాసిటీ ఉన్న అపాచీ మోడళ్ల డెలివరీలు కూడా పండుగ సీజన్‌లో ప్రారంభం కానున్నాయి.
ప్రీమియం విభాగంలోని RTR 310, RR 310 మోడళ్లకు కూడా టీవీఎస్ కొత్త లుక్ తీసుకొచ్చింది. ఈ రెండు బైక్‌లు ఇప్పుడు ‘బ్లాక్ డైమండ్’ ఎడిషన్‌లో అందుబాటులోకి వచ్చాయి. RTR 310 బ్లాక్ డైమండ్ ధర రూ.2.49 లక్షలు కాగా, RR 310 బ్లాక్ డైమండ్ ధర రూ.2.88 లక్షలు. రెండు మోడళ్లలోనూ కీలెస్ గో టెక్నాలజీ అందించారు. దీంతో ప్రీమియం బైక్‌లలో టెక్నాలజీ పరంగా మరో ఆప్షన్ ను టీవీఎస్ అందిస్తోంది.
రోనిన్ సిరీస్ లోని వేర్వేరు వేరియంట్లకు కూడా కొత్త ఫీచర్లు వచ్చాయి. రూ.1.42 లక్షల ధర ఉన్న రోనిన్ బేస్+లో రెండు కొత్త కలర్ ఆప్షన్లతో పాటు డ్యూయల్ ఛానల్ ABSను అందించారు. రూ.1.51 లక్షల మిడ్ స్పెక్ రోనిన్‌లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, కనెక్టెడ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయల్ ఛానల్ ABSతో పాటు గోల్డ్ ఫినిష్డ్ USD ఫోర్క్ ఉన్నాయి. ఇక రూ.1.63 లక్షల రేంజ్ టాపింగ్ రోనిన్‌లో ప్రీమియం సీటు, ట్రాక్షన్ కంట్రోల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ లీవర్‌లు లాంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి.
Read Also: సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!