E-Paper
Advertisement

Vivekananda Murder Case: వివేకానంద కేసులో కొత్త మలుపు.. ఒకే రోజు రెండు పిటిషన్లు, ఏం జరుగుతోంది?

Vivekananda Murder Case: వివేకానంద కేసులో కొత్త మలుపు.. ఒకే రోజు రెండు పిటిషన్లు, ఏం జరుగుతోంది?
Advertisement

Vivekananda Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి కేసు అనేక మలుపులు తిరుగుతోందా? ఒకేసారి సుప్రీంకోర్టులో ఎందుకు రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి? నిందితులు మళ్లీ జైలుకి వెళ్లడం ఖాయమా? న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ సునీత. శుక్రవారం ఆ పిటీషన్ సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకొచ్చింది. దీనిపై విచారణ జరిగిన సుప్రీంకోర్టు, సీబీఐతోపాటు భాస్కర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

Advertisement

భాస్కర్ రెడ్డి తరపున వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అనారోగ్య సమస్యలు చూపిస్తూ న్యాయస్థానం నుంచి బెయిల్ పొందారు భాస్కర్‌రెడ్డి. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే వరకే సీబీఐ, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయన బెయిల్ రద్దుపై రెండు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

మరోవైపు వివేకానంద కేసును ఏపీ సర్కార్ దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా ఒకప్పటి వివేకా పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆయన చెప్పిన విషయాలను రికార్డు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో మరో నలుగురు జగన్ బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డితోపాటు అవినాష్ బాబాయ్ మనోహర్ రెడ్డి, తమ్ముడు అభిషేక్ రెడ్డి, వైఎస్సార్ ట్రస్టు ఛైర్మన్ జనార్థన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Advertisement

ALSO READ:  పవన్ జాతీయ నేత.. చంద్రబాబు వృద్దుడు.. నేను ఒప్పుకోనంటూ వైసీపీ ఎంపీ ట్వీట్

గురువారం విచారణకు రావాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఆయా వ్యక్తులు డుమ్మా కొట్టారు. దీంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది డిసెంబర్‌లో కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వివేకా కూతురు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్సీ రాంసింగ్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే కొద్దిరోజుల కిందట ఈ కేసు విచారించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఆపై నోటీసులు జారీ చేయడం చకచకా జరిగింది.

Related News

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

Big Stories

Advertisement
×