Vijayasai Reddy: జనసేన అద్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఆ వైసీపీ ఎంపీ. గతంలో పవన్ పై విమర్శల జోరు సాగించిన వైసీపీ ఎంపీ, ఒక్కసారిగా పొగడ్తల వర్షం కురిపించారు. కారణాలు ఏవైనా 75 ఏళ్ల వృద్దుడు అంటూ ఏకంగా సీఎం హోదాలో గల చంద్రబాబును విమర్శించడం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు టాక్. ఇంతకు పవన్ ను పొగిడిన ఆ వైసీపీ ఎంపీ ఎవరంటే.. విజయసాయిరెడ్డి.
ఇటీవల విజయసాయి రెడ్డి పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దానికి ప్రధాన కారణం కాకినాడ పోర్ట్. కాకినాడ పోర్ట్ లో సెజ్ లకు సంబంధించి బెదిరించిన కేసులో ఏ2 గా విజయసాయి రెడ్డి ఉన్నారు. కాకినాడ పోర్టు ఉదంతం వెలుగులోకి తెచ్చింది పవన్ కళ్యాణ్. కాకినాడ పర్యటన సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన హంగామాతో అధికారుల ఉరుకులు పరుగులు మనం చూశాం. అంతేకాదు పోర్టు అక్రమాల పుట్టగా తయారైందని, రేషన్ అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారి స్మగ్లింగ్ తరహా బిజినెస్ జరుగుతుందన్నది పవన్ ఆరోపణ. దీనితో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై పోర్టు వద్ద ప్రస్తుతం నిఘా ఏర్పాటు చేశారు.
ఈ సమయంలోనే విజయసాయి రెడ్డి పేరు వార్తల్లో నిలిచింది. అది కూడా బెదిరింపులకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పలువురిపై కేసు నమోదైంది. విజయసాయి రెడ్డి లక్ష్యంగా కూటమి నేతలు సీరియస్ కామెంట్స్ సాగిస్తున్నారు. అటువంటి తరుణంలో విజయసాయి రెడ్డి ఒకే ఒక్క ట్వీట్ తో సంచలనం సృష్టించారు. ఈ ట్వీట్ లో పవన్ ను పొగుడుతూ.. సీఎం చంద్రబాబును వృద్దుడు అంటూ సంభోదించడం విశేషం.
జాతీయ ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ.. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డిఏ కూటమికి ప్రాతినిధ్యం వహించే సత్తా పవన్ కే ఉందని, డిప్యూటీ సీఎం గా పవన్ అందరికీ ఆదర్శమంటూ ట్వీట్ చేశారు. అలాగే ఏపీ యువ రాష్ట్రమని, అటువంటి రాష్ట్రానికి 75 ఏళ్ల వృద్ధుడైన పెద్దమనిషి నాయకత్వం వహించలేడని సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేయడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.
అసలే తనపై విమర్శలు వస్తున్న వేళ, కూటమిలో చీలిక తెచ్చేలా వైసీపీ ప్లాన్ వేసిందని అందులో భాగమే విజయసాయిరెడ్డి ట్వీట్ అంటూ టీడీపీ సోషల్ మీడియా రిప్లై ఇస్తోంది. అంతేకాదు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇరుక్కున్న విజయసాయి రెడ్డి తన రాజకీయ చతురత చూపించేందుకు తెగ ఆరాటపడుతున్నారని కూటమి రివర్స్ అటాక్ ఇస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ కి ఎటువంటి రిప్లై ఇస్తారన్నది వెయిట్ అండ్ సీ.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి
యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరు
నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉంది
ఏపీలోని NDA… pic.twitter.com/c8iJmjqMbT
— BIG TV Breaking News (@bigtvtelugu) December 6, 2024