BigTV English

Vizag : మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు..

Vizag : మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు..
Vizag


Vizag news today telugu(Breaking news in Andhra Pradesh): నేవీ అధికారి కూతురుపై అత్యాచారం.. విశాఖలో తీవ్ర సంచలనం రేపుతోంది. కంచరపాలెంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై.. ఆమె చదువుతున్న స్కూల్ లో అటెండర్ గా పనిచేస్తున్న సత్యారావు దారుణానికి ఒడిగట్టాడు. కంచరపాలెంలో గతకొంతకాలంగా జరుగుతున్న ఈ అరాచకం ఆలస్యంగా వెలుగుచూసింది. పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్న బాధిత విద్యార్థినిని ట్రాప్ చేసిన అటెండర్ సత్యారావు.. డ్రాయింగ్ నేర్పిస్తా అని చెప్పి దగ్గరయ్యాడు. ఆమెకు తెలియకుండా నగ్న వీడియోలు తీశాడు. వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడి.. కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అక్కడితో ఆగకుండా.. వీడియోలను ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు.

అయితే సత్యారావు పంపిన వీడియోలు చూపించి.. తన ఫ్రెండ్స్ కూడా బాలికపై వేధింపులకు పాల్పడ్డట్లు గుర్తించారు. గత నెల 3 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు.. పలుమార్లు శారీరకంగా వేధించారు. అయితే బాలిక ఇంట్లో ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆశ్రయించగా.. ఈ దారుణానికి కారణం అటెండర్ సత్యారావు అని తేలింది. సత్యారావుపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే సత్యారావు ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా..? లేక మరెవరైనా ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే తమ దర్యాప్తులో సత్యారావు ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డట్లు తేలిందని.. పోలీసులు వివరిస్తున్నారు. మరో ముగ్గురు దాడి చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×