E-Paper
Advertisement

YCP Leaders : వాలంటీర్లపై కామెంట్స్.. పవన్ పై వైసీపీ లీడర్స్ ఫైర్..

YCP Leaders : వాలంటీర్లపై కామెంట్స్.. పవన్ పై వైసీపీ లీడర్స్ ఫైర్..

YCP Leaders vs Janasena Pawan Kalyan(AP Politics): జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. పవన్‌ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నం తినేవాడెవడైనా వాలంటీర్లను తిడతాడా? అని మరో మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవ చేశారని గుర్తు చేశారు.

పవన్‌ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు? అని ప్రశ్నించారు. జగన్ గద్దెదించి.. ఎవర్ని గద్దెనెక్కిస్తావో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్ మండిపడ్డారు. జగన్‌ను ఏకవచనంతో పిలిచే అర్హత జనసేనానికి లేదని స్పష్టం చేశారు.

పవన్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. చంద్రబాబు కాళ్లు మొక్కితే తమకేమి ఇబ్బంది లేదంటూ కౌంటర్‌ ఇచ్చారు. వాలంటీర్‌ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్‌కు భయం పట్టుకుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్‌కు మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తామని మేనిఫెస్టో‍లో పెట్టాలని సవాల్‌ చేశారు.

పవన్‌ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. కరోనా సమయంలో పవన్‌ ఫాంహౌస్‌లో పడుకున్నారని.. వాలంటీర్ల మాదిరిగా ప్రజలకు సేవ చేయలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. పవన్‌ ఎప్పటికీ నటుడే కానీ రాజకీయ నాయకుడు కాలేరని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు విమర్శించారు.

Related News

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

డీఎస్సీపై వైసీపీ విమర్శలు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్, చామవరంలో ‘పేదల సేవలో’ కార్యక్రమం

మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ భేటీ, ఆపై ఫ్యూచర్ క్యాంపస్ వ్యవహారంపై చర్చ

Big Stories

×