BigTV English

Delhi : ఆర్డినెన్స్ వివాదం.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Delhi : ఆర్డినెన్స్ వివాదం.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేజ్రీవాల్ సర్కార్ కు, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ఆప్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ , జస్టిస్‌ పీఎస్‌ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై కేంద్రం వైఖరిని తెలపాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్‌ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్‌ ను ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ సర్కార్ ను ఆదేశించింది. తుదిపరి విచారణ జులై 17 వాయిదా పడింది.


ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న స్పెషల్ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

కేంద్రం చర్య కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంది. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను ఈ ఆర్డినెన్స్‌ దూరం చేస్తోందని తన పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ను రద్దు చేసి మధ్యంతర స్టే విధించాలని పిటిషన్‌లో పేర్కొంది. ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ ఇప్పటికే ఆయా రాష్ట్రాల సీఎంలు, పార్టీ నేతలను కలిసి మద్దతు కోరారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×