BigTV English

YS Bhaskar Reddy: ఆ లేఖపై ఎందుకు విచారణ చేయ్యట్లేదు.. నేను దేనికైనా రెడీ: భాస్కర్ రెడ్డి

YS Bhaskar Reddy: ఆ లేఖపై ఎందుకు విచారణ చేయ్యట్లేదు.. నేను దేనికైనా రెడీ: భాస్కర్ రెడ్డి

YS Bhaskar Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని గతేడాది సీబీఐ రెండు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ విచారణకు హాజరుకావాలని నోటీసుల పంపించింది. ఈమేరకు భాస్కర్ రెడ్డి విచారణ నిమిత్తం ఆదివారం కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైలులోని గెస్ట్‌హౌస్‌లో విచారణ జరగాల్సి ఉండగా.. అక్కడ సీబీఐ అధికారులు ఎవరూ లేకపోవడంతో భాస్కర్‌రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.


ఇక భాస్కర్ రెడ్డి రాకతో కడప సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదు? అని ప్రశ్నించారు. తనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నా కూడా తాను సిద్ధంగా ఉన్నానని భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.


Tags

Related News

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Big Stories

×