BigTV English

Chandrababu Naidu: బోగస్ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు లేఖ.. వైసీపీ రియాక్షన్ ఇదే..

Chandrababu Naidu: బోగస్ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు లేఖ.. వైసీపీ రియాక్షన్ ఇదే..

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కొన్ని దొంగ ఓట్లు నమోదయయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. డిగ్రీ చదవని వాళ్లు కూడా నకిలీ సర్టిఫికేట్లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. పలు చోట్ల అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై బోగస్ ఓట్లను సృష్టించారని ఆరోపించారు.


ఈమేరకు బోగస్ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేశారు. తిరుపతిలో 44వ డివిజన్‌లో చికెన్ షాపు అడ్రస్‌తో కూడా 16 ఓట్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఫేక్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందన్నారు. తప్పుడు అడ్రస్‌లతో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని తెలిపారు. బోగస్ ఓట్లు నమోదులో బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా సీఈసీ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇక చంద్రబాబు దొంగ ఓట్లపై సీఈసీకి లేఖ రాయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి టీడీపీ నేతలు సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని బోగస్ ఓట్లను చేర్చిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు.


Tags

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×