E-Paper
Advertisement

YS Jagan: భవానీపురం ఇళ్ల కూల్చివేతపై సీబీఐ దర్యాప్తు జరపించాలి.. వైఎస్ జగన్ డిమాండ్

YS Jagan: భవానీపురం ఇళ్ల కూల్చివేతపై సీబీఐ దర్యాప్తు జరపించాలి.. వైఎస్ జగన్ డిమాండ్
Advertisement

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ భవానీపురంలో పర్యటిస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు. ఇటీవల 42 ఇళ్లను కూల్చివేయడంతో వారు జగన్ వద్దకు వచ్చి తమ గోడును చెప్పుకోవడంతో.. ఇవ్వాళ వారి వద్దకు వచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా జగన్ కు వారు వివరించారు.

జోజినగర్‌లో గత కొన్నేళ్లుగా తాము ఇక్కడే ఉంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నామని, తాము చట్టబద్ధంగానే ఇళ్లు నిర్మించుకున్నామని, అయినప్పటికీ న్యాయస్థానాల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పోలీసుల సహాయంతో.. తమ ఇళ్లను కూల్చివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల కూల్చివేత సమయంలో కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు కూడా అక్కడే ఉండగా గోడలు పగలగొట్టారని, తమను రోడ్డున పడేసినట్టుగా జరిగిందని బాధితులు వాపోయారు.

Advertisement

బాధితుల మాటలు విన్న వైఎస్ జగన్, ఈ విషయంలో వైసీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయపరంగా అవసరమైన సహాయం అందిస్తామని, బాధితుల తరఫున చట్టపరమైన పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మీకు జరిగిన అన్యాయం గురించి మేము మౌనంగా ఉండం. ఈ విషయంలో పార్టీ మీ వెంట ఉంటుంది అంటూ వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బాధితులు 25 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తూ ఇళ్లు కట్టుకున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. డిసెంబర్ 31 వరకు స్టే ఉన్నప్పటికీ, ఆ స్టేను పట్టించుకోకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం అని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంక్వయిరీ చేయించి చంద్రబాబును కోర్టు ముందు దోషిగా నిలబెడతామని సవాల్ విసిరారు.

Advertisement

ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలకు మద్దతుగా వ్యవహరించింది. ప్రజలు ఇళ్లలో ఉండగానే గోడలు పగలగొట్టారు. ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

జోజినగర్ భూమి విలువపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 2 ఎకరాల 17 సెంట్ల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుంది. ఈ విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవాలని చూస్తున్నారు అని ఆరోపించారు. ఈ భూమి కోసం అనేక ఏళ్లుగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

2016 నాటి పరిణామాలను జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఫేక్ సొసైటీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించారు అని ఆరోపించారు. అంతేకాదు ఈ ఇళ్లకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిర్మాణ అనుమతులు, కరెంట్ కనెక్షన్లు, డ్రైనేజీ సౌకర్యాలు ఇచ్చారని, బ్యాంకులు కూడా లోన్లు మంజూరు చేశాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఇళ్లు కూల్చివేయడం అన్యాయమని జగన్ స్పష్టం చేశారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×