E-Paper
Advertisement

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

1. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన

జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంపై మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సభ్యులు.

2. అభివృద్ధికి ఎంఓయూ

విశాఖలో మంత్రి నారా లోకేష్, GMR మాన్సాస్ సంస్థతో ఏవియేషన్, ఏరో స్పేస్, ఎడ్యుసిటీ అభివృద్ధికి సంబంధించి ఎంఓయూ చేసుకున్నారు. భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరో స్పేస్, డిఫెన్స్ ఎడ్యుసిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.

3. పెరుగుతున్న కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దానిపై నిరసన తెలుపుతూ ఎలక్ట్రిక్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీ గాలి కాలుష్యంపై పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది.

4. ప్రత్యర్థి వర్గాల దాడి

పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత ఉద్రిక్తత నెలకొంది. విజయం సాధించిన ఆంగోత్ రవికుమార్ తన అనుచరులతో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతుండగా.. ఓటమిని జీర్ణించుకోలేని ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. దీనిపై సర్పంచ్, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

5. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం

నిర్మల్ జిల్లాలో రేపు ముధోల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరగనున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ప్రజలతో సమన్వయంతో వ్యవహరించి, ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు.

6. వనపర్తి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం

పంచాయితీ ఎన్నికల వేళ వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు చీరల పంపిణీకి తెర లేపారు. వారిని కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

7. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష

అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టులతో పాటు, ప్రజారోగ్య నూతన విధానాలపై చర్చించారు. ఈ సమీక్షకు యూఎన్‌ఏఐడీఎస్ ప్రతినిధి పీటర్ పాయిట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తో సహా అత్యున్నత స్థాయి జాతీయ, అంతర్జాతీయ నిపుణుల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైంది.

8. అలిగి వెళ్లిపోయిన వేమూరు ఎమ్మెల్యే

బాపట్ల జిల్లాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఈ సభలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అలిగి వెళ్లిపోయారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఆయన ఫోటోలు లేకపోవడంతో నిరసనగా ఆనందబాబు సభ మధ్యలోనే వెనుదిరిగారు.

9. గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు

అనంతపురం దుర్గా ఆంజనేయస్వామి ఆలయంలో గుప్త నిధుల పేరుతో కుట్ర జరుగుతోందని వైసీపీ శింగనమల ఇంచార్జి శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న పూజారికి మద్దతు తెలిపారు. 150 ఏళ్లుగా సేవ చేస్తున్న పూజారిపై దాడి యత్నాన్ని ఆయన ఖండించారు. దేవాలయాలపై రాజకీయ ఒత్తిడి తగదని హితవు పలికారు.

10.మచిలీపట్నంలో దొంగలు హల్ చల్

కృష్ణాజిల్లా మచిలీపట్నం నడిబొడ్డున కోనేరు సెంటర్ సమీపంలో దొంగలు హల్ చల్ చేశారు. కుంకుమ కొట్ల సందులోని సుమారు పది షాపుల్లో చోరీ జరిగింది. దొంగలు కొంత నగదు, వెండి రుద్రాక్ష మాలలు, వస్త్రాలతో పాటు, తమను పట్టుకోకుండా సీసీ కెమెరాలను సైతం తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

11. హైడ్రామా

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎర్ర వంక కాలవ ఆక్రమణ ఆరోపణల విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. కాలవ వద్దకు వచ్చి ఆక్రమణ నిరూపించాలని పెద్దారెడ్డిని డిమాండ్ చేశారు. తహసీల్దార్‌కు కూడా వినతిపత్రం ఇచ్చారు.

12. శోభానాగిరెడ్డికి నివాళులు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని భూమా ఘాట్ వద్ద శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంచు మనోజ్, మౌనిక దంపతులు నివాళులర్పించారు. మౌనిక రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజాసేవలో తమ కుటుంబం ముందుంటుందని మౌనిక తెలిపారు.

13. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

కాకినాడ జిల్లా గండేపల్లి వద్ద NH-16 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తల్లి, కొడుకు మృతి చెందారు. మృతులు ఆత్రేయపురం మండలం, వెలిచేరు గ్రామానికి చెందిన తోర్లపాటి తులసి, తోర్లపాటి కుమార్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

14. ఆసుపత్రి ప్రారంభం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రారంభించారు. గ్రామీణ పేద ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు.

15. విషాద ఘటన

విజయనగరం జిల్లా బొబ్బిలిలో మతిస్థిమితం కోల్పోయిన ఒక 24 ఏళ్ల యువకుడు తన మర్మాంగాన్ని కోసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖకు చెందిన ఆ యువకుడికి బొబ్బిలి పైవంతెనపై రక్తస్రావం అవుతుండగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు సహకరించక పారిపోయేందుకు ప్రయత్నించినా, సిబ్బంది అడ్డుకున్నారు. యువకుడి వద్ద దొరికిన చరవాణి నంబరు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, అతన్ని విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు.

16. సోనియా, రాహుల్ గాంధీలకు తాత్కాలికి ఊరట

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించింది. అయితే, ఈడీ దర్యాప్తును కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. ఈడీ దర్యాప్తు సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు ఆధారంగా జరిగింది తప్ప, కొత్త ఎఫ్ఐఆర్ ఆధారంగా కాదని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ మాత్రం, ఇది ప్రతీకార రాజకీయమని ఆరోపించింది.

17. కనిష్ట స్థాయికి దిగజారిన రూపాయి

భారత రూపాయి విలువ పతనమవుతూనే ఉంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో వరుసగా నాలుగో రోజు రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి దిగజారింది. నిన్న నమోదైన 90.78 అనే రికార్డు కనిష్ట స్థాయిని కూడా ఇవాళ అధిగమించింది. నేడు ఏకంగా 90.82కు రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది.

18. ధీమా వ్యక్తం

భారత అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్‌లో యుఏఈపై 171 పరుగులు చేశాడు. నేడు మలేసియాతో మ్యాచ్ నేపథ్యంలో, మలేసియా కెప్టెన్ డియాజ్ పాట్రో స్పందిస్తూ, వైభవ్‌ను పాకిస్తాన్ మాదిరిగానే కట్టడి చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. వైభవ్ గొప్ప ఆటగాడని, అతడిని ఎదుర్కోవడానికి తమ వద్ద వ్యూహాలు ఉన్నాయని డియాజ్ తెలిపాడు.

19. రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్

ఓజీ డైరెక్టర్ సుజిత్ కి పవన్ కళ్యాణ్ రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. పవన్ కెరీర్ లో తొలిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరేంతగా ఈ మూవీ హిట్ కావడంతో సుజిత్ కి ఈ కారు బహుమతిగా ఇచ్చారు ఓజీ పవన్. అయితే ఈ కారు తీసుకున్న క్షణాలు తన జీవితంలో అపూర్వమైనవిగా అభివర్ణించారు సుజిత్.

20. రిషబ్‌శెట్టి అసంతృప్తి వ్యక్తం

కాంతార సినిమాలోని ఓ సన్నివేశాన్ని బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కామెడీగా అనుకరించడంపై ఆ సినిమా దర్శకుడు రిషబ్‌శెట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సినిమా దైవిక అంశాలతో, కన్నడ ప్రజల ఎమోషనల్ కనెక్షన్ తో కూడుకున్నదని, దాన్ని హాస్యాస్పదంగా ఇమిటేట్ చేయకూడదని అన్నారు. దీనిపై రణ్‌వీర్ సింగ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×