E-Paper
Advertisement

AP politics: షర్మిళ వదిలిన బాణం ఎఫెక్ట్.. టీడీపీకి తగులుతోందా.. ఆ లెటర్ అంతరార్థం అదేనా..

AP politics: షర్మిళ వదిలిన బాణం ఎఫెక్ట్.. టీడీపీకి తగులుతోందా.. ఆ లెటర్ అంతరార్థం అదేనా..

AP politics: ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిళ స్పీడ్ పెంచారా.. ఒక వైపు కూటమికి, మరోవైపు వైసీపీకి తన కామెంట్స్ తో షాకిస్తూ.. రాజకీయంగా బలోపేతం కానున్నారా.. పక్కా వ్యూహంతో ఏపీలో కాంగ్రెస్ ను బలమైన పార్టీగా నిలపాలన్న తన లక్ష్యం వైపు షర్మిళ సాగుతున్నట్లు ఏపీ కాంగ్రెస్ ముఖచిత్రం కనిపిస్తోంది.

మొన్నటి వరకు తన అన్న మాజీ సీఎం జగన్ లక్ష్యంగా.. విమర్శల వర్షం కురిపించిన షర్మిళ.. తన గురి కూటమి వైపుకు తిప్పినట్లు ఉందని తాజాగా ఆమె విమర్శలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తాను ముందుంటానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి షర్మిళ ఘాటుగానే స్పందించారు.

అధికారం లేని సమయంలో ఒక వేషబాష, అధికారం వచ్చాక మరో రకం వేషబాష కరెక్ట్ కాదంటూ షర్మిళ అన్నారు. అంతేకాకుండా ఒకే మతానికి మీరు మద్దతిస్తే.. మిగిలిన మతాలు ఏమి కావాలని ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు మాత్రం ఏకంగా సీఎం చంద్రబాబుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి షర్మిళ కౌంటర్ గట్టిగానే ఇచ్చారన్నది టాక్.

ఢిల్లీ పర్యటన నిమిత్తం కేంద్ర పెద్దలను కలిసేందుకు సోమవారం చంద్రబాబు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే షర్మిళ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఆధారంగా.. 2021లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విశాఖ ప్రైవేటీకరణ ను అడ్డుకుంటానని, అవసరమైతే రాజీనామాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఓ లేఖ విడుదల చేశారు.

ఆ లేఖను ఇప్పుడు షర్మిళ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి మరీ.. మీరు ఢిల్లీ వెళుతున్నారు.. కేంద్ర పెద్దలను విశాఖ ప్రైవేటీకరణ పై నిలదీయండి. లేకుంటే మద్దతు ఉపసంహరణ అంటూ డిమాండ్ పెట్టండి. ఆంధ్రుల హక్కు ముఖ్యమా… లేక బీజేపీతో పొట్టు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగక విశాఖ ఉక్కు ముఖ్యమా ? లేదా ఎన్డిఏ లో పదవులు ముఖ్యమా ? మాట మీద నిలబడే సిఎం అవుతారా ? లేక మోసగాడు గా ముద్ర వేసుకుంటారా ? తేల్చుకోండని ట్వీట్ చేశారు.

Also Read: Politics: ఔను వారిద్దరూ కలిశారు.. ఒకరేమో సీఎం.. మరొకరేమో మాజీ సీఎం.. భేటీ అందుకేనా ?

కార్మికులకు విజయదశమి కానుకగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేస్తున్నట్లు, 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తున్నట్లు, భూములు కోల్పోయిన 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు, 23 వేల ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా అమ్మేది లేనట్లు, అధికారిక ప్రకటన చేయించాలని, లేకుంటే ఎన్డిఏ కూటమి నుంచి వైదొలగాలని సీఎం చంద్రబాబుకు
కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

మరి షర్మిళ చేసిన ఈ ట్వీట్ కి టీడీపీ నుండి ఎటువంటి సమాధానం వస్తుందో కానీ.. ఇటీవల షర్మిళ తనదైన శైలిలో ఛాన్స్ దొరికినప్పుడల్లా కూటమి, వైసీపీ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×