BigTV English

AP Elections 2024: ఏపీలో ఎలక్షన్‌ మూడ్‌.. ఉమ్మడి తూ.గో.జిల్లాలో వైసీపీ మార్పులు ?

AP Elections 2024: ఏపీలో ఎలక్షన్‌ మూడ్‌.. ఉమ్మడి తూ.గో.జిల్లాలో వైసీపీ మార్పులు ?
AP Elections News

AP Elections News(Latest news in Andhra Pradesh):

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు వింటర్‌లోనూ హీట్‌ పుట్టిస్తున్నాయి. వైన్‌ నాట్‌ వన్‌ సెవెన్టీ ఫైవ్‌ అంటూ తన బలగాన్ని ప్రజా క్షేత్ర యుద్ధానికి రెడీ చేస్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్‌. క్లీన్‌ స్వీప్‌పై దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ ఎత్తుగడలో భాగంగానే మార్పు మంచిదే అంటున్నారు జగన్‌. ఈ నేపథ్యంలోనే మార్పులపై ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లాలో సగానికి పైగా మార్పులుండే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నేతల గుండెల్లో గుబులు మొదలైంది.


తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటే.. అందులో దాదాపు 8 నుంచి 10 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చని సమాచారం. రాజమండ్రి చెల్లుబోయిన, మండపేట తోట త్రిమూర్తులు, రామచంద్రాపురం పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌, పిఠాపురం వంగా గీత, ప్రత్తిపాడు పర్వత జానకి, జగ్గంపేట తోట నరసింహులుకి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తునిలో దాడిశెట్టి రాజాను మార్చగా.. పి గన్నవరంలో ఎంపీ చింతా అనురాధకు ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే ఉభయగోదావరి జిల్లాల ఇన్‌చార్జ్‌ మిథున్‌రెడ్డి మాటను ఎమ్మెల్యేలు లెక్కచేయడం లేదట. అలాగే జట్టు కూర్పుపై అసంతృప్తి జ్వాలలు మొదలవడంతో వైసీపీ అధినేతకు తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలోనే కొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం.

.


.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×