BigTV English

YSRCP: పవనే సకల కళాకోవిదుడు.. జనసేన ఓ టెంట్‌హౌజ్ పార్టీ.. వైసీపీ కౌంటర్లు..

YSRCP: పవనే సకల కళాకోవిదుడు.. జనసేన ఓ టెంట్‌హౌజ్ పార్టీ.. వైసీపీ కౌంటర్లు..
ambati perni pawan

YSRCP: వైసీపీలోని సకల కళా కోవిదుడు, వైసీపీ బుడదడు తన గురించి రెగ్యులర్‌గా మాట్లాడుతారని పవన్ కల్యాణ్ ఇలా సెటైర్లు వేశారో లేదో.. అలా వాళ్లిద్దరూ మీడియా ముందు వాలిపోయారు. జనసేనాని వ్యాఖ్యలకు నిమిషాల గ్యాప్‌లోనే కౌంటర్లు ఇచ్చారు. ఎప్పటిలానే పవన్ స్పీచ్ కంప్లీట్ కాగానే.. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్నినానిలు రివర్స్ అటాక్ చేశారు. ఇంతకీ వాళ్లేమన్నారంటే..


పవన్‌ కంటే సకల కళా కోవిదుడు ఎవరూ లేరంటూ అంబటి పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చంద్రబాబు అంతటి మోసగాడు దేశంలోనే ఎవరూ లేరని కూడా అన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే పవన్‌ తాపత్రయమన్నారు. తనకు సీఎం పదవి వద్దు.. తాను అడగనంటూ.. చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సింగిల్‌గా వచ్చినా, కలిసొచ్చినా చిత్తుగా ఓడిపోవడం ఖాయమంటూ సవాల్ చేశారు అంబటి. చంద్రబాబు సిగ్నల్‌ ఇస్తే తప్ప వారాహి బయటకు రాదంటూ సెటైర్లు వేశారు.

ఇక, మాజీ మంత్రి పేర్ని నాని సైతం జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బలం లేదని పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. జనసేన ఓ టెంట్‌హౌజ్‌ పార్టీ అని.. చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడల్లా పవన్‌ బయటకు వస్తాడని.. చంద్రబాబు కోసమే పవన్‌ రాజకీయాలు చేస్తున్నాడని పేర్ని మండిపడ్డారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×