E-Paper
Advertisement

YSRCP : లిక్కర్ స్కామ్.. వైసీపీకి రూ.కోట్లలో ముడుపులు!

YSRCP : లిక్కర్ స్కామ్.. వైసీపీకి రూ.కోట్లలో ముడుపులు!
Advertisement

వైసీపీ పార్టీ గతంలో చేసిన తప్పులకు మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందని కూటమి నేతలు అంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్నింటినీ ప్రజల ముందు పెడతామని చెబుతున్నారు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు విచ్చల విడిగా ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పన్నులు పెంచడం వలన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని గత పీడకలలను కూటమి నేతలు గుర్తుచేసుకుంటున్నారు. జగన్ అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలకు తెరలేపారని, ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

మద్యపాన నిషేధం

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యపాన నిషేధం అమలు చేశారు. అది ఎంతో కాలం లేదు. నిషేధం వలన రాష్ట్రం రెవెన్యూ పడిపోయింది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అప్పటి సీఎం సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు పెట్టేవారు. ఓవైపు పెట్టుబడులు లేక రాష్ట్రానికి ఆదాయం పడిపోయింది. మరోవైపు పన్నులను పెంచారు.దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే తక్కువ ధరకే చీప్ లిక్కర్ పేరిట వైన్స్ తెరిపించారు.మరోవైపు మద్యం ప్రీమియం ధరలను అమాంతం పెంచేశారు. ఫలితంగా జనాల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం గుట్టుగా తెచ్చుకునేవారు. ఇలా కూడా రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి జగన్ కృషి చేశారని విమర్శలు వచ్చాయి.

లిక్కర్ స్కామ్..

Advertisement

రాష్ట్రంలో కొత్త బ్రాండ్లకు అనుమతి పేరిట ఢిల్లీ వేదికగా భారీ స్కామ్‌కు వైసీపీ నేతలు తెరలేపారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందే ఈ విషయం బట్టబయలైంది. ఇందులో అప్పుడు జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న జోగిరమేశ్, అతని సోదరుల హస్తం ఉందని దర్యాప్తు బృందాలు తేల్చాయి. రాష్ట్రంలో ఒకటి రెండు కంపెనీలకు అనుమతినిచ్చినందుకు గాను సదరు కంపెనీల నుంచి భారీగా డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. తాజాగా ఈ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగిరమేశ్, అతని సోదరులపై సప్లిమెంటరీ-2 చార్జీషీటును సిట్ దాఖలు చేసింది.

Big tv kissik talks Promo: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చంపేస్తాం.. హైపర్ ఆదికి బెదిరింపులు 

Advertisement

 

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఏర్పాటు చేయగా.. దర్యాప్తు కొనసాగుతోంది. ఇక లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడగా భావిస్తున్న అద్దేపల్లి జనార్ధర్ రావు నుంచి మాజీ మంత్రి జోగిరమేశ్ కు భారీగా ముడుపులు అందిస్తున్నట్లు సిట్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 2021-23 మధ్య పలు విడతల్లో డబ్బు చేతులు మారిందని తెలిపింది.అద్దేపల్లి సోదరులు, రమేశ్ మధ్య 7వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు సిట్ విచారణలో తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే 17 మంది నిందితులను విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈనెల 12 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ స్కాంలో మాజీ సీఎం జగన్ హస్తం కూడా ఉందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. త్వరలోనే వైసీపీ నేతల స్కాములు మరిన్ని వెలుగులోకి వస్తాయని జోస్యం చెబుతున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×