BigTV English

Ysrcp new sketch, Ambati petition: వైసీపీ మాస్టర్ ప్లాన్, అంబటితో పిటిషన్ వెనుక..

Ysrcp new sketch, Ambati petition: వైసీపీ మాస్టర్ ప్లాన్, అంబటితో పిటిషన్ వెనుక..

YSRCP latest news today(Political news in AP): వైసీపీ.. ఆ పార్టీ ఆలోచనలు అమోఘం. నెగిటివ్‌ పాయింట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫ్యాన్ పార్టీ దిట్టని పొలిటికల్ సర్కిల్స్‌లో కొందరు నేతల మాట. పిన్నెల్లిపై పొలిటికల్ హీట్ తగ్గించేందుకు ఈసారి అంబటి రాంబాబు రంగంలోకి దింపినట్టు వార్తలొస్తున్నా యి. ఆయనతో ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేయించింది.


అసలేం జరిగింది? జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తక్కువ సమయంలో రాజకీయాల్లోకి వచ్చి అధికారం అందిపుచ్చుకుందని నాడు కీర్తించారు చాలామంది రాజకీయ ప్రముఖులు. అదంతా ఐదేళ్ల కిందటి మాట. ఇప్పుడు నేతలతో ఆ పార్టీ అంతే అపఖ్యాతిని మూటగట్టు కుంది. ముఖ్యంగా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం వ్యవహారం ఆ పార్టీకి జాతీయస్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.

వైసీపీలోని ఇలాంటి నేతలు ఉంటారా అంటూ జాతీయస్థాయిలో చర్చించుకోవడం వివిధ రాష్ట్రాల నేతల వంతైంది. ఈ వేడికి కొంతైనా తగ్గించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13 జరిగిన ఎన్నికల్లో  సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ చేపట్టాలని అందులో ప్రస్తావించారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా ఐదుగుర్ని చేర్చారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.


ALSO READ: బ్రేకింగ్.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

మే 13న ఎన్నికలు జరిగితే దాదాపు 10 రోజుల తర్వాత మంత్రి అంబటి రీపోలింగ్‌పై పిటిషన్ వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ తర్వాత ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా క్లియర్‌గా చెప్పారు. రీపోలింగ్‌కు చేపట్టాలని ఎక్కడ నుంచి రిపోర్టులు రాలేదన్నారు. అయినా పోలింగ్ జరిగిన మరుసటి రోజు అంబటి పిటిషన్ వేస్తే బాగుండేదని, దాదాపు పది రోజుల తర్వాత దాఖలు చేయడం కరెక్టు కాదని పలువురు రాజకీయ నేతలంటున్నారు. మరి న్యాయస్థానం ఏమంటుందో చూడాలి. ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రాంతంలోనే రీపోలింగ్‌కు ఛాన్స్ లేదని ఏపీ ఈసీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Tags

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×